పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నైనను నాకాపద సంభవించినప్పుడు, శక్తిగలవాఁడవై యుండియు నేను వేడుకొన్నను లేశమైన సాయము చేయకపోతివి. దామోదరయ్య ప్రాణమిత్రుఁడుగా నున్నను నీయొద్ద నాతఁడు దాఁచుకొన్న పెట్టెను మిత్రుని పుత్రునికీయక యపహరింపఁ దలఁచితివి.

నారా__ఆ సొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా నపహరించవచ్చుననియు సిద్ధాంతియే మొదట నా కాలోచన చెప్పినాఁడు. నేను సొమ్ముపెట్టె నాతనియొద్దఁ బెట్టిన తరువాతఁ దనకందులో సగము భాగము రావలెనని పోరాడి, స్నేహితుని సొమ్ము పరులపాలగుట కిష్టములేక నే నొప్పుకొననందున మీ మెప్పునకై పెట్టెను మీకు దెచ్చియిచ్చినాఁడు.

రాజ__సిద్ధాంతియే నిన్నుఁ ప్రోత్సాహపఱచినను నీవు సహితము దోషివేకాని నిర్దోషివి కానేరవు. స్వయంకృతాపరాధమువల ననే నీ కిప్పుడీదుర్దశ ప్రాప్తించినది కాబట్టి యెఱుఁగక చేసికొన్న దాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను.

అని చెప్పి రాజశేఖరుఁడుగా రాతనికేమియు సాయముచేయక సాగనంపిరి. అదిమొదలుకొని రాజశేఖరుడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలనఁ దెలివితెచ్చుకొని ముఖ స్తుతుల కుబ్బి యెప్పుడును ధనము పాడుచేసికొనకయు, సమీపమునకు వచ్చి మంచిమాటలు చెప్పువారి నందఱిని మిత్రులని నమ్మకయు మెలగ జొచ్చిరి. యోగి వెనుక చేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియందెల్లను కేవల జఠరపూరకు లను నభిప్రాయమును మంత్రములయందును సువర్ణకరణాది విద్యలయందును దృఢమైన యవిశ్వాసమును గలిగెను. రుక్మిణికి వెనుక పట్టిన దయ్యములు భూతవైద్యము శకునములు మొదలగువానివలన నెల్లవారికిని వాని యందలి నమ్మకము చెడుటం జేసి మఱియెప్పుడును వారి యింట నెవ్వరికిని గ్రహబాధ కాని ప్రయోగ లక్షణము కాని దేవత లావహిం చుటగాని కలుగలేదు. కుటుంబములోనివారి జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాఱు విరుద్ధ ఫలముల నిచ్చుచు వచ్చినం