పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యంగడివానికి బేరమిచ్చి నిలువఁబడిరి. ఆ సమయమున నొక గృహస్థు తలగుడ్డ చుట్టుకొని నిలువుటంగీ తొడుగుకొని చేరవచ్చి “అన్నయ్యా! యీ మయిలబొట్టెక్కడిది?" అని యడిగెను. రాజ శేఖరుఁడుగా రాయన మొగము వంకఁ జూచి ఱిచ్చపడి మాటతోఁచక యూరకుండిరి, మరల నా పెద్దమనుష్యుఁడు "గంధపుచుక్కపెట్టి నారు. మనకు మైల యెక్కడనుండి వచ్చినది?" అని యడిగెను.

రాజ__మన రుక్మిణి పోయిన వర్తమానము నీకు తెలియ జేసినానుగదా? మొన్న గురువారమునాఁడు సీతకు వివాహము నిశ్చ యించుకొని పెండ్లిపను లన్నియుఁ దీర్చి సిద్ధముగా నుండఁగా బుధ వారమునాఁడు రాత్రి యెవ్వఁడో దుర్మార్గు డొకఁడు నేను లేని సమ యమున వచ్చి నీవు పోయినట్టు వ్రాసియున్న జాబు నొకదానిని మీ వదినెచేతికిచ్చి పోయినాఁడు.

రామ__ఎవ్వఁడో పెండ్లికార్యమునకు విఘ్నము కలిగింప వలెనని యీ దు స్తంత్రమును చేసియుండును.

రాజ__గిట్టనివాఁడెవఁడో యీ పన్నుగడ పన్నినాఁడు. ఇంటికి వచ్చి నీ వదినెగారిని సీతను చూచివత్తువు గాని రా.

రామ__నా కిప్పుడే రాజుగారితో మాటాడి మరల నిమిషముల మీఁద రాజమహేంద్రవరము వెళ్ళవలసిన రాజకార్యమున్నది. నెల దినములలో మరల వచ్చి మిమ్మందరను జూచి రెండుదినములుండి పోయెదను.

అని చెప్పి రామమూర్తిగారు తన పనిమీఁద రాజసభకు వెళ్ళి పోయిరి. రాజశేఖరుఁడుగారును తిన్నఁగా భీమవరమునకు వచ్చి భార్యతో రామమూర్తిగారి వార్తను జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించిన దుర్మార్గుని బహువిధముల దూషింపఁజొచ్చిరి. అప్పుడు కూలివాఁడు దిగఁబెట్టిపోయిన కఱ్ఱను తీసికొని వచ్చి సీత తండ్రికిఁ జూపెను. దాని నాతఁ డానవాలుపట్టి; చేతఁ బట్టుకొనిచూచి, నాడు రామరాజు చూపిన కత్తికఱ్ఱ యిదియేనని భార్యతోఁ జెప్పెను వారిరువును ఆలోచించుకొని నిశ్చయముగా నీ యుత్తరమును.