మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని దెలిసినది. వీరి కొమార్తెయున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణవతి. వీరిది మొదటినుండియు మంచి సంప్రదాయసిద్దమైన వంశము.
పద్మ__పలువురు పిల్లనిచ్చెదమని తిరుగుచున్నారు. నాకీవఱ కును వివాహము చేసికోవలెనని యిచ్చ లేకపోయినది, ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే వివాహమయి యిూపాటికి సంతాన యోగము కూడా కలుగదా? మీవంటివారందరును మెడలు విరుచుట చేత విధిలేక యొప్పుకోవలసి వచ్చినది. అయినను తమరీలాగున సెలవిచ్చినారని మా నాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పఱిచెదను.
శోభ__ఈసారి నా మాట వినకపోయినయెడల, మీ స్నేహమునకును మా స్నేహమునకును ఇదే యవసానమని మీ యన్నగారితో నేను మనవిచేయుమన్నానని ముఖ్యముగా చెప్పవలెను.
పద్మ__చి త్తము. ఆయన మీ యాజ్ఞను మీఱి నడవరు. సెలవు పుచ్చుకొనెదను.
పద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము చేయవలయునని రాజశేఖరుఁడుగారు శోభనాద్రి రాజుగారిని బహువిధముల బ్రార్ధించిరి. అతఁడును తన యావచ్ఛక్తిని వినియోగించి యా సంబంధమును సమకూర్చెదనని వాగ్దానము చేయుటయే గాక, ఆ సంబంధము దొరికినయెడల రాజశేఖరుఁడు గారికి మునుపటి కంటెను విశేష గౌరమును బ్రసిద్దియుఁ గలుగఁ గల దని దృఢముగా జెప్పెను. అంతట ప్రొద్దుక్రుంకినందున రాజుగారు భోజనమునిమిత్తమయి లేచిరి. తక్కినవారందరును సెలవు పుచ్చు కొని యెవరియిండ్లకు వారు పోయిరి.
మఱునాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కినతరువాత రాజశేఖ రుఁడుగారు వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఱునవ్వు నవ్వుచు లోపలినుండి వచ్చి "నిన్న మనము పంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినది సుండీ" యని చెప్పెను. "ఏమని