పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెచ్చుకొనియైనఁ జేతికి మురుగులు నుంగరములను వేసికొని, చాకలి వానియొద్ద పడిదెకుఁ దెచ్చుకొనియైనను విలువబట్టలను గట్టుకొను వారె మిక్కిలి గౌరవమునకుఁ బాత్రులుగా నుండిరి. లోపల సార మేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించు కొని తలకు గొప్ప శాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల యిండ్లకుఁ బోయి జీవితకాలములో నొకప్పుడును దేవాలయము త్రొక్కిచూడక పోయినను భగవన్నామమును కలలోనైనను స్మరింపకపోయినను వారిని పరమ భాగవ తోత్తములని, భక్తాగ్రేసరులని పొగడుచుండిరి; నిజమైన విద్వాంసుల యొక్కయు కవీశ్వరులయొక్కయు నోళ్ళను కడుపులును సదా శ్లోక ములతోను, పద్యములతోను మాత్రమె నిండియుండెనుగాని బాహ్య దంభము లేకపోవుటచేత నన్నముతో నొకప్పుడును నిండియుండ లేదు; దినమున కెనిమిది దొమ్మరగుడిసెలలో దూకినను, స్నానము చేసినట్టు జుట్టు చివర ముడివైచికొని బిళ్ళగోచులను బెట్టుకొని తిరుగు వారు పెద్దమనుష్యులని పొగడొందుచుండిరి. వేయేల, చాటున లక్షదుష్కార్యములు చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండ నున్నచో వారి ప్రవర్తనమును సంపూర్ణముగా నెఱిగియు నట్టివారి కందఱును సభలో సహితము మంచి నడవడి గలవారికిఁ జేయుదానికంటె నెక్కువ మర్యాదనుఁ జేయుచుండిరి. నీతి విషయమున వారి ప్రవర్తనమెంత హేయమయినదిగా నున్నను, మత విషయమునందు మాత్రము పయికి భక్తులుగానే కనఁబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పడుచుండెడి ప్రాణమిత్రుల కొక కుటీరమును గట్టించి యియ్యలేనివారు సహితము రాతివిగ్రహములు కాపురముం డుటకయి వేలకొలఁది వెచ్చపెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయిన తరువాత వసతులు లేక పాడుపడిన దేవా లయములను నూటయిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుఁడుగారు కోటిలింగములకుఁగూడ బూర్వమెప్పుడో దేవాలయములు పాడయి నందున నా ప్రకారముగా నిసుకదిబ్బలయందుఁ బడియుండినవైయుండ