పుట:Raajasthaana-Kathaavali.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు

71


తన భూములు రాణాకు దక్కనిచ్చుట కిట్టము లేక సురేశ మల్లుఁడు రాజుకన్న బలవంతులు బాహ్మణులేకదా యని నమ్మి వారికి దాన మిచ్చిన మాన్యములు రాజు మరల గ్రహించుటకు భయపడు నని యాభూములను వారికి దాన మిచ్చి తానెం దేనిం జనియె. రాణా సురేశ మల్లుఁడు చేసిన యాపనికిఁ గోపోద్దీపితుఁడయ్యు బ్రాహ్మణ క్షేత్రములను మరల గ్రహించినచో దానును దన వంశస్థులును నఱువదివేల యేండ్లు నరకకూపముల బాధపడవలయు నని నమ్మి యాబాధలు పడుట కిష్టము లేక బ్రాహ్మణుల జోలికి పోవక యొక దండము పెట్టి యూరకుండెను.

అనంతరము సురేశమల్లుఁడు మీవారు శాశ్వతముగ విడిచి దక్షిణాభిముఖుఁడై చని యడవుల కొండల, గ్రుమ్మరుచుండ నొక్కనాఁ డొక యాఁడుమేక తనపిల్లను తోడేలు కబళింపకుండ సంరక్షించు చుండఁగాఁ జూచి తొల్లిచారుణీ దేవి యర్చకురాలు తనకు జెప్పిన భవిష్యద్వృత్తాంతంబు జ్ఞప్తికిం దెచ్చుకొని యాసమయ మిప్పుడు వచ్చిన దని యా మేఁకను బిల్లను తోడేలు బారినుండి కాపాడి యాప్రాంతములందే చరియించుచు మెల్ల మెల్లగ సచ్చటి యాటవికుల లోబరచుకొని చుట్టు ప్రక్కల దేశ మాక్రమించుకొని దేవలయను గ్రామముఁ దనకు నివాసముగఁ జేసికొని యందొక కోట గట్టి రాజై తన జీవిత శేష మచ్చటనే గడపెను. దైవయోగమున సురేశమల్లుఁడు తాను చిత్తూరునకు దొంగ యైనను యచ్చటం బుట్టి బెరిగిన వాఁడగుటచే నాపట్టణమందును మీవారుదేశమునందును ప్రేమము విడువఁ జాలక తానాపురమం దభిమానము గలవాఁ డగుటయేగాక యెల్ల యపుడు చిత్తూరునే మాతృస్థానముగ నెంచుకొనవలసిన దని తన కోడుకుల కవసాన కాలమున జెప్పిపోయె. ఆమాటలయందు వాని కొడుకులు విశ్వాసముంచుట చేతనే చిత్తూరున కగ్బరు చక్రవతి౯ వలన మహాపాయము వాటిల్ల రాణా యప్రయోజకుఁ డై చావునకు వెఱచి