పుట:Raajasthaana-Kathaavali.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

రాజస్థానకధావళీ,


యిట్లనియె. నాయనా ! నేనేమి చేయఁగలను? నీవు నన్నెక్కడ కాలూది నిలువకుండఁ దఱుముచుంటివి. నే నెచ్చట నైనతల దాఁచుకో వలయునుగదా ! అందుచే నిచ్చట నుంటి" నని సురేశమల్లుఁడు ప్రత్యుత్తర మిచ్చే, ఆ రాత్రి యట్లుగడపి మఱునాఁడుదయమున పృథివీ రాజు పినతండ్రిని జూచి యచ్చటకు సమీపమున నున్న భవానీ దేవాలయమునకుఁ దనతో వచ్చి యా దేవికి బలి సమర్పింపుమని యడిగెను. సురేశమల్లుఁడు లోకానుభవ మెఱింగినవాఁ డగుటచే పృథివి రాజు దన కీనెపమున నేదేని యపాయము సేయునని యనుమాపించియో యంతకుమున్ను కొన్ని నెలలనుండి తెరపి లేక పోరులు సలుపుచు గాయములచేఁ బీడితుఁ డై కదలజాలకయో పృథివిరాజును జూచి క్రిందటి రాతిరి తగిలినగట్టి దెబ్బకే తాను కదలఁజాల కున్న వాఁడ నని వంక పెట్టి తనబదులు సారంగ దేవునిం గొంపొమ్మని యోత్తి పలికెను.

ఎవరు వచ్చినను మంచి దేయని, పృథివిరాజు సారంగ దేవుని దన వెంట నాలయంబునకుం గొంపోయి యచ్చట వానిం జంప నుంకించుటయు నావీరుఁడును పృథివిరాజునకు లొంగక కొంతసేపు పో రొనర్చి తుదకు వానిచేత హతుఁడయ్యె. తొల్లి మీవారు రాజు లలో మొట్ట మొదటి వానికి నప్రతిహతమగు ఖడ్గముఁ బ్రసాదించిన యామహా దేవికిఁ బృథివిరాజు భక్తి మెఱయ సారంగదేవునితల బలిగా సమర్పించి తండ్రికిఁగల ప్రాఁతపగ దీర్చికొని సంతుష్టాంతరంగుఁడయ్యె.

సారంగదేవుని దుర్మరణవాత౯లు విని సురేశమల్లుఁ డేదియో నెపము పెట్టి యన్న కొడుకుతో జనకపోవుట చాల మేలయ్యె నని సంతసించి గుఱ్ఱము నెక్కి ప్రాణభయంబున నచ్చోటు విడిచి సపరివారముగ నొండొక యెడకుఁ బోవఁదలంచి మున్ను తాను జయించి యాక్రమించిన భూములకుం జనియే. ఆభూములలో నిరపాయముగఁ దాను నన్ని నాళ్ళనుండి పగతుర బారి కోడి తానందు నిలువ లేనప్పుడు