పుట:Raajasthaana-Kathaavali.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృధివీరాజు సాహసములు.

59


ఈవాతం రాయమల్లునకుఁ దెలిసినతోడనే యతఁడు పృథివి రాజును మందలించి జీవాట్లు పెట్టి యిట్లనియె. “నా గారపు కోడుకగు సంగుని నాకు దక్కనీయక దుండగీడ "వైతివి. పాపము వాఁడు నీకు వెఱచియేగదా నిలువనీడ లేక యడవులఁ గొండలఁ గ్రుమ్మరు చున్నవాఁడు. నీ మొగముఁ జూడ రాదు. నావద్దనుండి లేచిపొమ్ము. పోయి నీ వెప్పుడు పోరాటములె కోరుచుందువు గావున యెందేని. పోరులు సలుపుచు బ్రతుకుము.

అభిమాన ధనుఁ డగు పృథివి రాజు తండ్రి పలుకులు విని రోషముఁ జెంది తన గాయములు కుదిరిన వెనుక తండ్రి వద్ద సెలవు గైకొని యొక గుఱ్ఱము నెక్కి యైదుగురు సేవకులను వెంటఁ గొని తన యాయుధముల సంగ్రహించుకొని తాను గొప్ప కార్యములఁ జేసి ప్రసిద్ధుఁ డైనప్పుడు గాని మరలఁ దండ్రియింటికి రాఁగూడ దని నిశ్చయించుకొని యిల్లు విడిచి విదేశములపాలై పోయెను.

రాజస్థానమున గద్వారను చిన్న దేశము కలదు. దానినిఁ బూర్వము మీనవంశజులగు రాజు లేలుచుండిరి. చిత్తూరు రాజు లా దేశమును మీనకులజులవద్ద నుండి జయించి పుచ్చుకొని తమపాలనలో నుంచిరి, రాయమల్లుని సోదరుఁడు మీవారు పాలించిన కాలముల గద్వారుసంస్థానము మీవారునకు లోఁబడక స్వాతంత్యము నొందెను. రాయమల్లు మఱల దానిని లోబఱచుకొన లేక పోయెను. పృథివి రాజిల్లు విడిచి క్రమక్రమముగా నా దేశమును జేరెను. అతఁడు పోవునప్పటి కాదేశమునం దంతట బందిపోటు దొంగలు నిరంకుశవత౯ నులయి పట్టపగలు దోఁపుడులు చేయుచు చెల రేఁగి యుండిరి, 'మీనవంశజుఁ డొకఁ డా దేశమునకుఁ దానుఁ బ్రభువునని చెప్పుకొనుచుండును; కాని యతని యధికారము పేరునకు మాత్రమే. రాయమల్లుఁడా దేశమున నతని యధికారము స్థాపింపలేక పోవుటయే గాక దొంగల దౌర్జన్యమయిన నడప లేక పోయెను. పృథివిరాజా దేశమును జయించి