పుట:Raajasthaana-Kathaavali.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

రాజస్థానకథావళి.


గెత్తించుచు వచ్చెను. అతని శరీరమున నైదు కత్తి పోటు లుండెను. వాని గుఱ్ఱము మిక్కిలి యలసట పడి నోట నురుగులు గ్రక్కుచుండెను. రక్తమున స్నానము చేసినట్లు వాని దేహ మంతయు నెఱ్ఱబడి యుండెను. బాణము తగులుట చే నొకకన్ను పోయి యుండెను. రహతూరు వంశస్థుఁడు నీ వెవ్వఁడ వని వాని నడుగ నాతఁడు "నేను రాయమల్లు కుమారుఁడగు సంగుఁడను నన్ను నాసోదరులు చంప నెంచి" రని చెప్ప రహతూరుండు వానికభయమిచ్చి చేయూతయిచ్చి గుఱ్ఱముపై నుండి దింపి సేదం దేర్చు నప్పటికీ వారియెదుట, గుఱ్ఱపుదళము వచ్చుచున్న జాడ దెలుపుదు మ్మగుపడెను. అది చూచి సంగుఁడు "అదె నాతమ్ముఁడు జయమల్లుఁడు నన్నుం దెగటార్చుటకు వచ్చు చున్నాఁడు. పృధివిరాజు సురేశమల్లుఁడు నొండారులం దాఁకి పోరి యలసటఁ జెంది కదలలేక యచ్చటనే యుండి ” రని పలికెను. రహ తూరు వంశస్థుఁ డామాటలు విని భయము లేదు. ఈమఠములోనికి వారు రాకుండ నేను నిలిజెను, ఇంతలో నీవు నిరపాయముగఁ బారి పొమ్మని ధైర్యముఁ జెప్పి వాని నావలకుఁ బంచె. అంతఁ గొంత సేపటికి జయమల్లుఁడు వచ్చి రహతూరు వంశజునిఁజూచి “సంగుని మా కప్పగింపవలసిన " దని యడుగ నతఁను సంగుఁడు నన్ను శరణుఁజొచ్చి గావున నతని నప్పగింపనని నిర్భయముగాఁ బలికెను. అప్పుడు జయమల్లుఁడు "అట్లయిన మేమే వానినిఁ బట్టుకొనెద'"మని మఠముం బ్రవేశింపఁబోవ రహతూరుఁడు కోపాయత్తుఁడై కత్తిదూసి జయమల్లుని వాని సేనను లోనం జోరనీయక నిరోధించే. అంతట కొండొకసేపు వఱకు సందడికయ్యంబు జరుగ శరణాగత బిరుదమును బూనిన రహతూరుఁడు ప్రాణములు విడిచెను. అతఁడు గూలిన వెనుక జయమల్లుఁడు మొదలగు వారు మఠముం జొచ్చి యందు సంగుని గానక యతఁడు మఱల తప్పించుకొని పారిపోయె నని విషాదము నొంది చనిరి,