పుట:Raajasthaana-Kathaavali.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రాజస్థానకధావళీ.


సమిపించి చూచునప్పటి కామంట చుట్టు సగము సర్ప దేహము సగము మనుష్య దేహము గలిగి వికృత వేషములతో నున్న కొన్ని స్త్రీ విగ్రహములఁ జూచెను. అందొకటి పండ్లి కిలించుచు నీవెవ్వడవు ? ఇక్కడ నీకేమిపని యున్నది. మాయుత్సవమున కేభంగము కావించెదవని వాని నడిగెను. అతఁడును నిప్పుపై నున్న యొక డేగిసా చుట్టు గూర్చున్న యాదయ్యముల యొద్దకుఁ 'బోయి ,మీపండుగ నేఁ. జెరుప రాలేదు. విశ్వకర్మనిర్మిత మగు నాఖడ్గమును నాకిచ్చిన నాదారిని నేఁబోయెద! నని చెప్పెను. ఆపొగనడుమనుండి చూడ చూడ తలలు విరియబోసికొనియున్న యాదయ్యముల కొకిబికి మొగములు మఱింత భయంకరములై వికృతములై కానంబడియె. అప్పుడవి యతనితో మాటలాడక' డేగిసామూత తీయుమని సన్న జేయ నతఁడు వేరువక యట్లుచేసి లోనున్న దానం జూచెను. అతఁ డేమి చూచెనో యెవ్వ రెఱుఁగరు. అందొక చింపిరి దయ్యము విక విక నవ్వి డేగిసాలో నుడుకుచున్న పదాథ౯ము కొంత(దీసి యొక మూకుడులో బెట్టి తిను మని వానికిచ్చెను. అతఁడును సందేహింపక మారుమాటాడక యిచ్చిన దానిని భక్షించెను.

అప్పుడవి వానిని మెచ్చి యొక మూలనుండి రెండంచులఖడ్గమును దెచ్చి వాని కిచ్చి పంపెను. హమీరును కృతకృత్యుఁడై యెప్పటి యట్లంథకార బంధురమగు గుహను జాగరూకతతో దాటి బయటబడి విశ్వకర్మ నిర్మితమగు ఖడ్గమును చేత ధరించి తనవారి కన్నులకు విందుచేసి యాఖడ్గముతో శత్రువులఁ దెగటార్చి మీవారు రాజ్యము చిరకాలము బాలించెను.