పుట:Raajasthaana-Kathaavali.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాహమీరు.

31


జాలుఁడు మనకార్యము నవలీలగా సాధించును. అనవుడు హమీరామెయుపాయమునకు సంతసించి విచారమును విడిచి వితంతువైనను దనభార్య జాణతనమును శౌర్యమును గలిగి రాణిగా నుండఁదగినదని నిశ్చయించి మరునాఁ డుదయమున మామయగు మాల దేవునొద్దకుఁ బోయి కోపమును విషాదమును లేకయే మంత్రియగు జాలుని దమకునరణముగ నిమ్మని యడిగి శలవు పుచ్చుకొని భార్యతోడను కొత్త మంత్రితోడను కైలు వారాపట్టణము జేరెను.

అనంతర మొకసంవత్సరమునకు రాణా కీభార్యవలన నొకకుమారుఁ డుదయించెను. రాణాయు రాణియు జాలుఁడును గలిసి యెవ్వియో పన్నుగడలం బన్నుచు దినములు గడపుచుండిరి. ఇట్లుండ పెండ్లియయిన రెండేండ్ల తరువాత చిత్తూరున కోకయాచారి వచ్చి హమీరు సింగుభార్య తనచిన్న కుమారు నెత్తుకొని వచ్చి కుల దేవతలకు మ్రోక్కించి పోవలయునని కోరుచున్న దని చెప్పెను. అప్పుడు మాలదేవు యుద్ధయాత్ర వెడలి పర దేశమున నుండెను. అతని జ్యేష్ట కుమారుడు తన తోఁబుట్టువు రాఁక కనుమతించి యామే వచ్చినప్పుడు సగౌరవముగా నామె నంతఃపురమున: బ్రవేశ పెట్టెను. ఆజాణయు మెరియల వంటి సైనికులతోడను మంత్రియగు జాలుని తోడను కోటలోఁ బ్రవేశించి మాయోపాయము లెన్నియో కడు నేర్పునంబన్ని ప్రాధి౯ంపఁ దగిన వారిఁ బ్రాధి౯ంచి, లంచములు కావలసిన వారికి లంచము లిచ్చి బెదరింపఁ దగిన వారిని బెదరించి, పొగడ్తలకుబ్బు వారిని పొగడి తండ్రి సైనికుల నెల్ల వశము చేసికొని తనభత౯ను రావించి వాని ననాయానముగ లోపలఁ బ్రవేశ పెట్టించి బంగారపు సూర్యబింబముగల రాణా హమీరు యొక్క ధ్వజము కోటబురుజుపై నెత్తించెను. పిమ్మట గోన్ని దినములకు మాల్దీవు యుద్ధము నుండి రాగా కూఁతురు నల్లుఁడును వానింగోటఁ జేరనియ్యక తమ రిది యాక్రమించినట్లు తెలియఁచేయుట కయి ఫిరంగి గుండ్ల బ్రయోగించిరి. రాణా తన రాజధానిని