పుట:Raajasthaana-Kathaavali.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

రాజస్థానకధావళీ.


మరల నాక్రమించెనన మీవారు దేశమునం దంతట జనులు చెప్పు కొనసాగిరి.

అందుచేఁ బ్రజానురాగముగల వాని సేనలో వేనవేలు చేర సైన్యము ప్రబల నుయ్యెను. ఆ సేనం గూర్చుకొని యతఁడు శత్రుసంహారమున కయి సమకట్ట నొకని వెనుక నొకరుగ రాజులెల్లరు లోఁబడిరి. మాల దేవుని తనయులలో నొకఁడు హమీరు ప్రేరణమున వధియింపఁ బడియె, రెండవవాఁడు వానికి లోఁబడి సేనాపతియై కొంత దేశమును జయించి యతని కొప్పగించెను. చిత్తూరునందున్న చక్రవతి౯క సైనికులు రాణా యెదుట నిలువఁ జాలరైరి. స్వదేశపురాజు లదివఱకే వానికి లోఁబడి యుండిరి. చిత్తూరునగరమునకు మీవారు దేశమునకు మరల యెప్పటి మహోన్న తదశ వచ్చెను. ఈనడుమ నల్లాయుద్దీను చక్రవతి౯ మృతినొందుటచే ఢిల్లీ రాజ్య మనేక సంక్షోభములకు లోనయి తనయవస్థలలోఁ దా నుండుటచే స్వతంత్రించిన విదేశముల వంకఁ జూడ లేకపోయెను. అందుచే మీవారు రాజ్యము హమీరు పాలనము క్రింద వృద్ధిఁ జెంది కడు బలపడి యెను.

హమీరు చిత్తూరుసింహాసనమున సుప్రతిష్ఠితుఁ డయిన పిదప తురకలు తొల్లి చేసిన చెరుపంతయుఁ జూచి దుఃఖించి మరల బాగు చేయఁబూనెను, అలా యుద్దీను తాను గోనిపోయినంత గొనిపోయి తీసికొనిపోలేని దానిని బాడు చేసి రాణాలధనాగారమునందలి ధనమంతయుఁ గొల్లఁగోనెను. హమీరు చేయిదాఁ టిపోయిన యమూల్యా భరణములకు ధనమునకు నంతగా విచారింప లేదుగాని కోటలో నడుగు పెట్టినది మొదలు పూర్వాజి౯ తమగు నొక వస్తువునకై చింతిల్లఁ జొచ్చెను, అది యేదియన మున్ను జగన్మాతయగు భవాని వంశకత౯ యగుబప్ప రావునకుఁ బ్రసాదించినదియు విశ్వకర్మ నిర్మితమైనదియు రెండంచుల వాడిగలదియు నగు మహాఖడ్గము. అదియెచ్చటనున్నదో యెవ్వ రెఱుఁగకున్నను లోకమాత యాఖడ్గము మాత్రము గోహింస