పుట:Raajasthaana-Kathaavali.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

రాజస్థానకధావళీ,


లములయి పోవు ననియు శంకించి మహబత్ఖానుఁడు దేవర వారు దుస్తు లిక్కడ నే తొడుగుకొనవచ్చునని చెప్పెను.

జహంగీరు వానిమాట కడ్డము చెప్పక యక్కడనే దుస్తులు వేసికొని బయలు దేరుటకు గుఱ్ఱ మెక్కెను. అప్పుడు మహబత్ఖానుఁ డడ్డము వచ్చి "స్వామీ ! గుఱ్ఱమెక్కుటకంటే నేను గెక్కుట మంచిది. ఏనుఁ గెక్కినచో నందఱకు మీరగపడుదురు. అది నిరపాయము కావున దాని నెక్కఁదగు " నని పలికెను. అప్పుడు జహంగీరు తన యేనుఁగు పయి నెక్కఁదలఁప రాజ పుత్రులు వాని మావటి వానిం జంపిరి. అప్పుడు మహబత్ఖాను చక్రవర్తిని దన యేనుఁగు పై నెక్కించి యిరుప్రక్కల ఖడ్గపాణులగు నిరువుకు రాజపుత్రులను గావలి పెట్టి తన శిబిరమునకుఁ దీనికోని పోయెను.

ఆశిబిరము చుట్టు మెఱియల వంటి రాజ పుత్రులను మహబత్ఖాను కావలి వేసి జీలము నదిమీఁద నున్న పడవలవంతెన నూర్జహాను పాలఁ బడకుండఁ గాపాడుటకు మఱి రెండు వేల రాజపుత్రులను నియమించెను. మహబత్ఖాను తన్ను ఖయిదీ గాఁ బట్టుకొనియెనని తెలిసికొని నను చక్రవతి౯ కాలము దప్పివచ్చినప్పు డేమి చేయఁ గల మని యూరకుండి 'నాసారాబుడ్డి, కావలసినప్పుడు సారా యందిచ్చు సేవకుని నా కిచ్చినారుగదా తక్కిన ప్రపంచ మేమయిన నాకేమి' యని సరిపెట్టుకొని యక్కడనే హాయిగ నుండెను.

చక్రవతి౯ పక్షమున నున్న జనములో ధైర్యము సాహసముగలది నూర్జహా నొక్కతియె చక్రవతి౯ కి జరిగిన భంగపాటు వినినతోడనే నూర్జహాను పిరికిపడక నిరుపేదవాని వేసము వేసికొని చిన్న సవారి నెక్కి యాడంబర మేమియు లేకుండ నావలియొడ్డుఁ జేరుటకు బయలు దేరెను. చక్రవతి౯ శిబిరము వెంట వచ్చిన పేదరా లెవ్వతియో పోవుచున్న దనుకొని వంతెన గాఁచురాజపుత్రు లామెను నిర్బయముగ బోవనిచ్చిరి.' అట్లు నిరపాయముగ నావలియొడ్డు జేరి సేనాపతులను సామంతులను