పుట:Raajasthaana-Kathaavali.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి,

197

దిగ్గున లేచి చూచెను. చూచునప్పటికిఁ దనగుడార మంతయు యమదూతలవంటి రాజపుత్ర సైనికులతో నిండి, యుండెను. అయిన నతఁడు జంకక ధైర్యము చిక్కబట్టి ఖడ్గముపైఁ జేయివైచి పయికిఁ దీయుచుండ మహావీరుఁ డగుమహబత్ఖానుని మొగము వాని కగపడెను. ఆఖానును జూచుటకుఁ గాని వాని పేరు వినుటకుఁగాని యతనికి లేశ మిష్టము లేనందున యతని ముఖదర్శనము చక్రవర్తి క్రోధమును బెంచెను. అయిన నతఁ డప్పటి తన యవస్థను జ్ఞప్తికిఁ దెచ్చుకొని తొందరపడినఁగార్యము పాకముతప్పు నని మహబత్ఖానుని జూచి ఓ రాజ ద్రోహి! ఇది యేమి? అనిఅడిగెను. ఆపలుకులు విని మహబత్ఖాను చక్రవర్తి, కాళ్ళపైఁ బడి యనేక విధముల దీనాలాపములం బలుకుచు నిట్లనియె."నాశత్రువులు దేవర వారితో నామీఁద నేరములు చెప్పి నాకు మీ కెడబాటు చేసిరి. అందుచేతనే గదా నేను కొన్ని నాళ్ళ క్రిందటనే మీ శిబిరముఁ బ్రవేశించినను మీరు నా మొగము జూడ రయిరి నాతోఁ బలుకరైరి. ఎల్లయిం దేవరవారి దర్శనముఁ బడయగోరి యిట్లు చేసితిని గాని ద్రోహము చేయుటకుఁ గాదు." అని మొరపెట్టుకొనెను. అతనిపలుకులు చక్రవర్తి క్రోధాగ్ని కావ్యధారలయ్యెను అయినను సమయము గాక పోవుటచే జహంగీరు కోపము దిగమ్రింగి పయికి మంచి మాటలే చెప్పుచు నదను దొరకినప్పుడు మహబత్ఖానుని కొంపఁ దీయ వలయు నని నిశ్చయించుకోని యతఁడే మన్న నదియే సరి యనసాగెను. అప్పుడు మహబత్ఖాను చక్రవర్తితో " దేవా ! మీరు పట్టపు టేనుఁగుపై నెక్కి సామంత రాజులకు సైనికులకు, దర్శన మీయవలసిన సమయము వచ్చినది. మీరగపడకున్న వారందఱు కళవళపడుదురుగదా! కావున నేనుఁగు నెక్కుఁ "డని మనవిచేసెను. చక్రవర్తి సరే యని తనదుస్తులు తొడుగుకొనుటకు పక్క గుడారములోనికి వెళ్ళివత్తునని చెప్పెను. అక్కడికి వెళ్ళేనా చక్రవర్తి యింకఁ దనకు దక్కక నూర్జహాను చేతిలోఁ జిక్కి పోవు ననియుఁ దనపన్నినపన్ను గడ లన్నియు నిష్ఫ