పుట:Raajasthaana-Kathaavali.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రాజస్థానకధావళీ.

చిత్రకథ వారివ్వరికిం దెలుపఁ గూడ దనియును, గ్రామంబున నెప్పుడేమాట వినినప్పుడది తన కేఱుంగ జేయవలయు ననియు గట్టడి చేసి వాండ్ర నందు కొడంబరచి, వారిచేఁ బ్రమాణములు చేయించుకొని, యంతట నెల్లర వీడ్కొలిపె. బప్పఁడు పశులమందల మేపుచున్న యాకాలమున చింతపువ్వువన్నెయా వొకటి స్వభావమునఁ బరమ సాధు వయ్యు నింటికి వచ్చి పాలు చేపక యెగదన్ను చుండుటఁ జేసి కారణము దెలియక యెట్టకేలకు బప్పఁడే దానిపాలు పితికికొనుచుండ వలయు నని నిశ్చయించి వానిదొంగతనము పొంచి యుండి పట్టుకొమ్మని యూరి పెద్దలు కొందఱిని నియోగించిరి. బప్పఁ డది యెఱిఁగి కడునలిగి యావు వట్టిపోదుగుతో నింటికి వచ్చుమాట నిజమే కాని తానేపాప మెఱుఁగ ననియుఁ బొదుగుపై నెన్నఁడు జేయి యైన వేయ లేదనియుఁ జెప్పి యాగోవు జాడలు దా గని పెట్టి రహస్యము బట్టబయలు చేయుటకయి, యత్నించి మందలోనుండి యావసరము ప్రతిదినము తప్పిపోవుచుండె నని తెలిసికొని యొకనాఁడు సాయంకాలము పుంతలు పొదలు దాఁగి వెను వెంటం జని యొక కొండ చరియం జేరెను. అచ్చట నల్లి బిల్లిగ, నల్లుకొన్న పొదలనడుమ నొక వేదిక పై నమరియున్న మహాశివలింగమునకుఁ దప్పిపోయినయావు తనపొదుగునుండి పాలు చేపి యభిషేకముఁ జేయుచుండెను. చిర కాలము నుండి జపములు తపములు నుపవాసములు చేసి ముక్తి నిఁబడయు నిచ్ఛతో మనస్సు పరబ్రహ్మముతో నైక్యముఁ జేయఁ బ్రయత్నించుచు నాసమయమున సమాధిలో నున్న యొకానొక సిద్ధుఁడావేది సమీపమున నుండెను. బప్పఁ డామహాత్ముని సమాధినుండి మేలుకొలుప నాతండు తన దివ్యజ్ఞాన మహిమమున నెదుటనున్న బాలుఁ డుత్త మరాజకులసంభూతుడనియు, మహా కార్యములు చేయ నవ తరించినాఁ డనియు దెలిసికోనియె, బప్పఁ డాసిద్ధునకు సాష్టాంగనమస్కార మొనర్చి తాను నాగేంద్రగామవాసి యగు పశుల కాపరి యనియు తప్పిపోయిన యొక