పుట:Raajasthaana-Kathaavali.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బప్పరావులకథ

5

మందలం గావ నూరి బైటికిఁ బోవుచు, వారివలెనే తాను నాడుచుఁ బాడుచు వారందఱకు యజమానుఁడయి తనయాజ్ఞ వారు శిరసావహించునట్లు ప్రవరి౯ంచెను. బప్పఁడు నానాఁటికిఁ బెఱిగి నెఱజవ్వనంబుఁ బ్రాపించి యుండ నొకనాఁ డట్లతద్ది పండుగకు నాగేంద్ర గ్రామనాయకుని కూఁతురు తోడిపడుచులం గూడి పండుగదినంబున హాయిగ నుయ్యల లూగ నూరు బైట 'దేవళముచుట్టు నున్న మామిడి తోపున కరిగి యచట నుయ్యల పన్నుటకు త్రాళ్ళు దొరకమి చిన్నబోయి యుండె, దైవవశమున నాసమయంబున బప్పఁ డామావితోటలో దిరుగు చుండ బాలిక లాతనిం గాంచి తమ కొక యుయ్యలత్రాడు తెచ్చి పెట్టుమని వేఁడ బప్పఁడును దాని కియ్యకోని "సరే మీరు నాతో నొక యాట యాడుటకు నొప్పుకొందు రేని మీకు త్రాడిచ్చెదను, మీరు మనసార నూఁగ నచ్చు" నని పలుక గ్రామనాయకునికూఁతు రది యేమియాట యని యడిగెను. మరేమియు లేదు.మనము పెండ్లి యాట యాడుకొంద మని బప్పఁ డుత్తర మిచ్చెను. బాలురును బాలికలును బొమ్మల పెండ్లియాటలు తమ పెండ్లి యాటలు నాడుకొనుట లోకవిదితమేకదా! ఉయ్యెలత్రా డెక్కడ దొరకకపోవునో యని బాలిక లట్లు చేయుట కియ్యకొనిరి. గ్రామ నాయకునికూఁతురుచీర కొంగున రాజపుత్రుఁడు తన శాలువకొంగు ముడివేసి యామెయు నామెతో నున్న మణి యాఱువందల పడుచులయు చేతులు పట్టుకొని యొక వృక్షమునకుఁ బ్రదక్మిణముఁ జేసి కొండొక తడవునకు పాణిగ్రహణ మహోత్సవము నిర్వర్తించెను.

నాగరికత లేనియాపల్లెటూరిపడుచులు తమచుట్టముల యిండ్ల జరుగువివాహములలోఁ బ్రధానాంగముగాఁ జరుగుపని యదియే గావున యాపని కప్పుడు సంతసించి తనివిదీర నుయ్యలలూఁగి, సాయం కాల మిండ్లకుఁ జనియా పెండ్లియాటమాట మఱచి యుండిరి బప్పఁడు తనతోడి బాలకుల నందరఁ జేరఁబిలిచి తానాదినమునఁ గావించిన