పుట:Raajasthaana-Kathaavali.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయసింగుని కథ.

111


పూర్వకాలమున బప్పరావులకు భిల్లుఁ డొకఁడు మొగమున టీకా వేసి యనగా నెఱ్ఱని చిహ్నము వేసి నజాతికతఁడు రాజని చెప్పి వానికి లోఁబడియెను. అట్లే యాభిల్లులందఱు నుదయసింగు తనుకు రాజని యంగీకరించి వానికిం దోడ్పడుదు మని వాగ్దానము చేసిరి. కమలమియరుకోట లో జైనుమతస్థు: డగుకోమటి యసాసా యనునతఁ డొకనాఁడు తల్లియుం దానును కూరుచుండి మాటలాడుచుండఁగా తననిమిత్త మొక యాఁడుది వచ్చి వేచియున్న దని విని యామెను లోపలికి రమ్మని యానతిచ్చెను. అప్పుడు, మేలిముసుంగు వేసికొని యున్న యొక రాజపుత్ర స్త్రీ వానియెట్టయెదుట నిలిచెను, నావల్ల నీ కేమి కావలయు నని యసాసా యడుగ నామె తన పక్కనున్న రాజకుమారు నెత్తుకొని "యితఁడు నీరాజు ఈ బాలకుని రక్షింపుమని యాబిడ్డను వాని పాదములపైఁ బడ వైచెను. అసాసా కొన్ని ప్రశ్న లడిగి పున్నవలన బాలకునివృత్తాంత మంత యు నెఱిఁగి యేమి చేయుటకుఁ దోఁచక కళవళపడఁజొచ్చెను. స్వామిభ క్తినిబట్టి చూచినను మతమునుబట్టి చూచినను గౌరవమును జూచినను బాలకుని రక్షించితీరవలయు నని యతనికిఁ దోఁచెను. కాని దుర్జనుఁ డగు వనవీరునితోఁ గయ్యము నకుఁ గాలు డ్రవ్వుట కిష్టము లేదు. జైనుమతస్థునకు రాజపుత్రున కున్నంత సమరోత్సాహము లేదు. అదిగాక రాఁదలంచిన యవస్థ తనస్వ విషయము కాకపోవుటచే నసాసా యుద్ధమునకు మొదలే సమ్మతింపడయ్యె. అందుచేత నతఁడు సందేహించుచు దీర్ఘాలోచనము చేయుచు ననేక కష్టములు పడిపడి వచ్చినపున్న కేసి చూచుచు తనకు రాఁగల యిక్కట్టులనెల్లఁ జెప్పుచుఁ గాలయాపనము చేయుచుండ నంతలో నతనితల్లి కుమారుని పిలిచి నాయనా! యేల సందేహించి భయపడెదవు? స్వామిభ క్తిగలవారు కష్టముల గణియింపరుగదా. ఇతఁడు నీ రాజగు సంగునికుమారుఁడు. మనయదృష్టము బాగున్నచో మనకే జయము కలుగఁగూడదా' యని పలికి వాని