పుట:Raajasthaana-Kathaavali.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

రాజస్థానకథావళి.


డుదయసింగును బ్రతుక నిచ్చునా? రాచపురుగేది మిగిలినను వనవీరునకు క్షేమకరము గాదుగదా" యనుకొని చప్పుచప్పున రాజపుత్రుని మేననున్న విలువగల బట్టలు నగలు నొలిచివైచి వానినొక పండ్ల గంపలో పండుకొనఁబెట్టి మీద కొన్ని యాకులను పండ్లను గప్పి యది యొరులకంటఁబడకుండ జాగరూకతతోఁ దీసికొనిపొమ్మని మంగలి వాని కప్పగించి "నీవీక్షణమే యిచ్చటినుండి పోయి నదిలో నిసుక తిప్పమీఁద నీగంప పెట్టుకొని కూర్చుండుము. నేనుం ద్వరలోవచ్చి మిమ్ముం గలిసికొనియెద" నని చెప్పి వానిని సాగఁదోలెను.

మఁగలి యాగంపెత్తుకొని కావలి వాండ్ర యెదుటనుండియే యనేక కవాటములు దాఁటిదాఁటి కోటవెలుపలికిం జనియెదు. రాజభటులు వానింజూచియు రాజులు తినఁగా మిగిలిన కూరలు నన్నము మంగలి తన యాలుబిడ్డల నిమిత్తము పట్టుకొనిపోవుట నిత్యము జరుగుచుండుటచే నాదినమును గూడ నట్లే మంగలి గొనిపోవుచుండఁ బోలునని గంప బరీక్షించి చూడకయే వానిని విడిచివచ్చిరి. పున్న యింకను గొంతపని చేయవలసినది, రాజపుత్రుని మీఁదనుండి తీసిన విలువబట్టలు తనకొడుకునకుఁ దోడుగవలసి యుండెను.

ఆబట్టలు నిద్రించియున్న తన కొడుకునకు విసవిసందొడిగి రాఁబోవు దురవస్థ కెదురుచూచుచు నామె గూర్చుండెను. అంతట యచిరకాలములోనే యామేకు మనుష్యుని యడుగుల చప్పుడు వినఁబడియె, వనవీరుఁడు తలుపులు దీసికొని ఖడ్గపాణియై యామె యెట్ట యెదుట నిలిచి "అమ్మీ ! నీయధీనమునందున్న రాజకుమారుఁ డేడీ ? ఉదయసింగును నాకుఁ జూపుమని గంభీర ధ్వనితోఁ బలికెను. కన్నకడుపగుటచే యాదాసిహృదయము నీరై పోయినందున నేమియుం బలుక జాలక యొక్క నిముస మూరకుండి పిమ్మట ధైర్యముఁ దెచ్చికొని యతఁడే రాజకుమారుఁ డని చేతితో నిదురించు చున్న తన కొడుకుం జూపెను. క్రూరకర్ముఁడగు వనవీరుఁడు ఖడ్గముతో వానితల రెండు