పుట:Raadhika Santhvanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకనము xiii

ఇట్టి వింకను గలవు. సాభిప్రాయములైన ప్రయోగములు నొకకొన్ని కలవు.

ఉదా :-
1. శ్రీకృష్ణునిఁ దోడి తెమ్మని రాధ పంపిన చిలుక పుల్లయ వేమవరము చేసికొని వచ్చినది. తదుపమానము: ---

‘హరు నుదుటి కంటి మంటల నంట బెదరి
త్రుళ్లి రౌతును బడవైచి వెళ్లివచ్చు
తీయవిలుకాని సాంబ్రాణి తేజ’ (19).


2. కృష్ణుఁడు రాఁడు; రాధకుఁ గూరిమి పోదు. ‘అత్తకోక తొలఁగినటు’ లున్నదఁట యాసందర్భము. అత్త సరుదుకోదు; సరుదుకొమ్మని యల్లుఁడు చెప్పలేడు (46) (ద్రావిడభాషలో ‘అత్తగారికచ్చ’ యనునర్థముగల లోకోక్తి కలదఁట).

3. రాధాపదాక్రాంతుఁడైన కృష్ణు నామె యదొక గమ్మత్తుగా లేవనెత్తినదట ఆ ‘యెత్తిన పట్టువీడక’ లేచినాఁడఁట యా రసజగత్సమ్రాట్టు (116).

ఇట్టి ప్రయోగవైచిత్రి సముఖమునకే చెల్లినది. ఆస్వారస్యరహస్యాభిజ్ఞత ముద్దుపళనికే చెల్లినది. సముఖము ప్రయోగములలో నింకొక విలక్షణతయుఁ గలదు. గుట్టుబొయ్యీని, చూచేరు, మోవాని (మోవి+అని), నడిచే, నవ్వేటి, చేసుక, వద్ది మొదలగునవి. ఆప్రయోగము లాయుగసహజములు. ‘అచ్చుత’ శబ్ద మొకటి ప్రాసఘటితముగా నిందుఁ గన్ప