పుట:Raadhika Santhvanamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiv రమ్యాలోకనము

ట్టుచున్నది. అదియు నాఁటి యపరూపవికృతివిశిష్టతలలో నొకటి (చూ విజయరాఘవుని రఘునాథనాయకాభ్యుదయము). ఆకవులకు వ్యాకరణము రాదనికాదు, వారు మహాకవులని కాదు, కానీ వారి కావ్యములం దప్రయత్నముగనో, యభినివేశపూర్వకముగనో దొరలిన వా ప్రయోగములు. అంతే; అదియొక విలక్షణత! సముఖము ప్రయోగములు రసాపకర్షకములు కాలేదనియే చెప్పవచ్చును.

రసికశేఖరుఁడగు విజయరంగనికొలువు. దక్షిణాంధ్రయుగ శ్రీనాథుఁడగు శేషము వేంకటపతి స్నేహము, తిమ్మన గారి యొరవడి, చేమకూర పలుకుఁబడి సముఖము నొకసరసకవిగాఁ జేసినవి. రాధికాసాంత్వనము, అహల్యాసంక్రందనము మనకు దక్కినవి. ఉభయత్ర భావబాంధవ మున్నను శైలీభేదము గన్పట్టుచున్నది. మొదటిదానిలోఁ దెలుఁగుపొలుపును, రెండవదానిలో సంస్కృతప్రౌఢియు నెక్కువ. అహల్యాసంక్రందనమే యతని కవిప్రథకు మూలకందమైనను దాని కీలక మీ చిన్నికృతి యైన రాధికాసాంత్వనమే.

యస్వీ జోగారావు
బి. యే. (ఆనర్పు)


ఆంధ్ర విశ్వకళాపరిషత్-
పరిశోధనశాఖ, వాల్తేరు.
1-అక్టోబరు, 1958