పుట:Punitha Matha.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకు మహత్తర కార్యాలు చేశాడు"అని. అలాగా దేవుని మహత్తర భాగ్యాలను పొందిన తల్లిని మనం స్తుతించవద్దా? ఆమె ధన్యురాలని ఎలుగెత్తి చాటవద్దా? మరియను పూజించడమంటే దేవుణ్ణి అతని క్రీస్తుని ఆరాధించడమే. ఓ పునీతురాలి యందు ప్రతిఫలించిన ఆ ప్రభువు వరాలను కొనియాడ్డమే. అసలు పునీతులందు కూడ దేవుణ్ణి మహిమ పరుస్తుంటాంగదా?మరియకు భక్తి చూపేవాళ్లు ఆ తల్లి పట్ల బిడ్డల్లాగ ప్రవర్తిస్తున్నారని రుజువు చేసికొంటారు. మరియభక్తి యదార్ధక్రైస్తవ జీవితానికి కొలకర్ర.

జీవగగ్ర. 11. ఆదర్శ మాత

పూర్వాధ్యాయంలో మరియమాత పట్ల చూపవలసిన భక్తిని గూర్చి ముచ్చటించాం. మరియు క్రైస్తవులకు ఆదర్శంగా వుంటుంది. క్రైస్తవ సమాజంలోని గురువులూ మఠకన్యలూ గృహస్టులూ ఆమెను ఆదర్శంగా బెట్టుకొని జీవిస్తుంటారు. అదేలాగో మూడంశాల్లో పరిశీలించి చూద్దాం.

1. మరియ గురువులకు ఆదర్శం

మరియ గురువుల మాత. ఆమె గురుపట్టమనే దేవద్రవ్యాను మానం పొందేలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు గురువుని కని పెంచి పెద్దజేసింది. అతనికి విద్యాబుద్దులూ దైవభక్తీ నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఏలా ఆరాధించాలో బోధించింది. అలాగే మరియు గురువులకు కూడ మాతయై వాళ్లకు కూడ విద్యాబుద్దులూ దైవభక్తీదైవారాధన నేర్పుతుంది. క్రీస్తు గురువునకు తల్లియైన మరియ ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులకు గూడ "ද් తల్లి.