పుట:Punitha Matha.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిత్రుపాదుల్లో క్రిసోస్తం, అలెగ్జాండ్రియా సిరిల్, గ్రెగోరీ నీస్సా, గ్రెగోరీ నాసియాన్సస్, జాన్ డమసిన్ మొదలైనవాళ్లు ముఖ్యలు. ల్యాటిను పితృపాదుల్లో అగస్టీను,జెరోము, ఆంబ్రోసు ముఖ్యులు. సిరియను పితృపాదుల్లో ఏప్రేము ముఖ్యుడు. వీళ్లంతా క్రీస్తుశకం 2-5 శతాబ్దాల మధ్యలో జీవించిన వాళ్లు. అంతా పునీతులు. చాలమంది బిషప్పలు కూడ. వీళ్ల బోధలు ఇప్పడు గ్రంథరూపంలో లభిస్తాయి.

క్రైస్తవ మతాంశాలన్నీ స్పష్టంగా బైబుల్లో లేవు. కొన్ని అంశాలు పితృపాదుల బోధల్లో మాత్రమే వుండిపోయాయి. అందుకే శ్రీసభ బైబులుతోపాటు పారంపర్య బోధను కూడ గ్రహించింది. మనకు బైబులు ఎంత ప్రమాణమో పారంపర్య బోధకూడ అంత ప్రమాణం. పరిశుద్ధ రచయితలను ప్రేరేపించి బైబులు గ్రంథాలను వ్రాయించిన పరిశుద్ధాతే పితృపాదులను కూడ ప్రేరేపించి వాళ్ల చేత ఆయా క్రైస్తవ సత్యాలను చెప్పించింది.

16వ శతాబ్దంలో ప్రొటస్టెంటు శాఖలు ఆదిమ క్రైస్తవ సమాజం నుండి చీలిపోయాక పారంపర్య బోధను గ్రహించడం మానివేశాయి. బైబులును మాత్రమే ప్రమాణంగా స్వీకరించాయి. ఈ కారణం చేతనే నేడు క్యాతలిక్ సమాజానికి ఇతర ప్రొటస్టెంటు క్రైస్తవ సమాజాలకూ క్రైస్తవ సత్యాల విషయంలో కొన్ని భేదభావాలు గోచరిస్తాయి.

మరియమాతనుగూర్చి క్యాతలిక్ సమాజం విశ్వసించే సత్యాలన్నీ బైబుల్లో స్పష్టంగా కనిపించవు. కాని పితృపాదుల బోధల్లో వున్నాయి. ప్రొటస్టెంటు శాఖవాళ్లు పితృ పాదుల బోధలను నిరాకరించారు కనుక ఆ శాఖల్లో మరియమాతను గూర్చిన అంశాలు అడుగంటిపోయాయి.

పూర్వాధ్యాల్లో మరియమాతనుగూర్చి చెప్పిన అంశాలను