పుట:Punitha Matha.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గబగబ పరుగెత్తాలి. మన అవసరాలను ఆతల్లికి విన్నవించుకొని ఆమె సహాయం అడుగుకోవాలి. మన అయోగ్యతను తలంచుకొని భయపడ కూడదు. బిడ్డల దౌర్భాగ్యం ఎంత గొప్పదో అంత జాలితో తల్లి వాళ్లను ఆదరిస్తుంది గదా?

మరియ మనకు రకరకాల వరప్రసాదాలు ఆర్జించి పెడుతుంది. కాని ఆమె ఇచ్చే ప్రధాన వరప్రసాదం క్రీస్తే మరియ క్రీస్తనే పండ్లను కాసిన ద్రాక్షతీగ. క్రీస్తనే వెనువేసిన గోదుమపైరు. ఈ గోదుమ అప్పం ఈ ద్రాక్షసారాయం మనపూజలో క్రీస్తుగా మారిపోతాయి. కనుక ఆ తల్లి రోజురోజు మనకు క్రీస్తనే భాగ్యాన్ని ప్రసాదిస్తుండాలని అడుగుకొందాం.

మరియను తల్లిగా బొందడమూ, ఆమెను ప్రేమించడమూ గొప్పభాగ్యం. మరియమాత పట్ల భక్తిలేనివాళ్లు దిక్యూమక్మూలేని అనాథ శిశువుల్లా అలమటించి పోతారు. 12వ శతాబ్దపు భక్తుడైన ఆన్సెల్మ్ “ఓ ప్రభూ! నీవు మీ తల్లిని ఎంతగా ప్రేమించావో, మేముకూడ ఎంతగా ప్రేమించాలని కోరుకుంటున్నావో, అంతగా ఆతల్లిని ప్రేమించేభాగ్యం నీ మాతృ ప్రేమద్వారా మాకు ప్రసాదించు" అని ప్రార్ధించాడు. కాని క్రీస్తు ఎంతగా కోరుకొంటూన్నాడో అంతగా ఆ తల్లిని ప్రేమిస్తున్నామా?

8. ఇద్దరు ఏవలు

క్రైస్తవమతానికి ఆధారాలు రెండు; బైబులు, పితృపాదుల బోధలు. ఈ రెండవ దానినే పారంపర్యబోధ అంటాం. పితృపాదులు గ్రీసు, సిరియా, ల్యాటిను దేశాలకు చెందినవాళ్లు. వీళ్లు గ్రీకు, సిరియను, ల్యాటిను భాషల్లో ప్రజలకు బోధించారు, రచనలు చేశారు. గ్రీకు