పుట:Punitha Matha.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావాలతో చూస్తుండాలి. ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా దేవుని ఆత్మకు మందిర మౌతుంది. తేపతేపకు క్రీస్తునే ఆహారంగా పుచ్చుకొంటుంది. కడన ఉత్థానమై ప్రభు సన్నిధిలో నిలుస్తుంది. కనుక ఈ దేహం పవిత్రమైంది. పురుష దేహమైనా సరే స్త్రీ దేహమైనా సరే, ఈ దేహానెపుడూ కామ భావాలతో చూడకూడదు. గౌరవమర్యాదలతో, భక్తి ప్రపత్తులతో చూస్తుండాలి. పౌలు బోధించినట్లుగా ఈ దేహంతోను పాపం చేయకూడుద, ఈ దేహంలోను పాపం చేయకూడదు. అనగా అశుద్ధ పాపాలతో ఈ దేహాన్ని అమంగళ పరచుకోగూడదు -1కొ 6,8.


ఉత్థాపితమాత మోక్షంలో వుండి మనలను మరచిపోదు. అక్కడ నుండి మనకోసం మనవి చేస్తుంటుంది. మనలను కూడ తన చెంతకు పిల్చుకుంటుంది. మనమూ ఆ చోటునకు చేరాలని హెచ్చరిస్తుంటుంది. కావున మనం ఇచటినుండి చూపు మరల్చి అటువైపునకు చూస్తుండాలి ఆ తల్లి చూపించే దివ్యథామం వైపు పయనం సాగిస్తుండాలి.


6. మరియరాజ్ఞ

ఏడవ శతాబ్దపు భక్తుడు ఇల్డెఫోన్సస్ మరియను గూర్చి చెపూ "నేను క్రీస్తుదాసుణ్ణి గనుక మరియదాసుణ్ణి మరియు దేవుని దాసురాలు కనుక నా రాజ్ఞ నేను మరియరాజ్జిని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసికొంటాను" అని వ్రాశాడు. మరియు మన రాణ్ణి. ఇక్కడ మూడంశాలు విచారిద్దాం.


1. మరియ రాజ్జి అంటే ఏమిటి?

మరియు పరలోక, భూలోకాలకు రాజ్జిగా నియమింప బడిం