పుట:Punitha Matha.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సృష్టిప్రాణులందరికీ ఆమె రాజ్ఞ "కృపారసము గల మాతయై యుండెడి రాజ్జీ వందనము" మొదలైన ప్రాచీన జపాలు ఆమెను రాజ్జిగా పేర్కొంటాయి. కనుక బహుప్రాచీన కాలం నుండే క్రైస్తవ ప్రజలు ఆమెను రాజ్జిగా కొనియాడుతూ వచ్చారని విశదమౌతుంది.

మరియ రాజ్ఞత్వం మనలను పరిపాలించడం కోసం గాడు. మన కొరకు మనవి చేయడం కోసం. ఆ తల్లి నరులందరి కోసమూ క్రీస్తుని మనవి చేస్తుంది. అందరికీ వరప్రసాదాలు ఆర్జించి పెడుతుంది. ఆమె కోరికలనూ, మనవులనూ క్రీస్తు ఎప్పుడూ కాదనడు. ఆ రాజ్ఞ ఓ చంద్రబింబం లాంటిది. వేడుదల రూపమైన ఆమె పాలనం మనందరికీ ఆహ్లాదం కలిగిస్తుంది.

2. కారణాలు

కాని మరియ ఎందుకు రాజ్ఞ యైనట్లు? క్రీస్తురాజు, ఆ రాజు తల్లియైన మరియకూడ రాజ్ఞ దేవమాతగా ఆమె పొందిన అంతస్తే ఆమెకు ఉత్థాపనం సంపాదించి పెట్టింది. ఆ యంతస్తే ఆమెను విశ్వానికి రాజ్జిగా గూడ చేసింది. ఆ తల్లి మధ్యవర్తియైన క్రీస్తుతో సహకరించి పనిచేసిందన్నాం. ఆమె క్రీస్తు అనే రాజుకు సహాయు రాలుగా నిలిచింది. కనుకనే ఆ ప్రభువు రాచరికంలో తానూ పాలుపొంది మనరాణి ఔతుంది.


క్రీస్తు తాను ఆర్జించిన రక్షణం ద్వారా మనకందరికీ ప్రభువ య్యాడు. ఆ రక్షణంలో పాల్గొనిన మరియమాత కూడ మనకు రాజ్ఞ ఔతుంది. దైవరాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు మరియమాతా ఇద్దరూ పాటుపడ్డారు. ఆ రాజ్యానికి క్రీస్తు రాజైతే, మరియ రాజ్ఞ కాదా? L