పుట:Punitha Matha.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనంతట తాను ఉత్థాన మయ్యాడు. మరియమాత తనంతట తాను ఉత్థానం కాలేదు. ప్రభువే ఆమె దేహాన్ని ఉత్థాపనం చేశాడు. అనగా లేపాడు. కనుకనే ఆమె దేహం మోక్షాన్ని చేరింది.

2. ఉత్థాపన కారణాలు

దేవుడు మరియమాత దేహాన్ని ఎందుకు ఉత్థాపనం చేసినట్లు? పాపం ద్వారా నరునికి మరణం సిద్ధించింది - 18° 15,56. మరణం చెందిన దేహాలు మన్నైపోతాయి. కాని మరియకు పాపమంటూ లేదు. ఆమె నిష్కళంకమాత. అంచేత ఆమెదేహం పాపశిక్షగా క్రుళ్లి మన్నై పోవలసిన అవసరం లేదు. నేరుగా మోక్షానికి వెళ్తుంది. మరి ఆమె చనిపోవడం మాత్రం దేనికి? మరియు చనిపోయింది తాను పాపాత్ము రాలు కావడం వల్ల కాదు. క్రీస్తుకు పోలికగా వుండడం కోసం. నరజాతికి శిరస్పైన క్రీస్తు చనిపోయాడు కనుక నరులంతా చనిపోవలసిన ధర్మం వుంది. కనుక మరియు కూడ చనిపోయింది. (అసలు ఆమె చనిపోనేలేదు, చనిపోకుండానే నేరుగా మోక్షానికి వెళ్లిపోయింది అని ప్రాచీన క్రైస్తవ వేదశాస్రజ్ఞలు కొంతమంది నుడివారు. కాని అందరూ ఈ వాదాన్నిఅంగీకచరు. మరియు మరణాన్ని గూర్చి మనకేమీ స్పష్టంగా తెలియదు. శ్రీసభ ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ బోధించలేదు కూడ.)

క్రీస్తుతోపాటు మరియకూడ మన రక్షణంలో పాల్గొంది. మన వినాశం ఒక పురుషుడు ఒక ప్రీ ద్వారా. అలాగే మన ఉద్ధరణం కూడ ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా. తొలి ఆదాము తొలి యేవ తెచ్చి పెట్టిన పతనానికి రెండవ ఆదాము రెండవయేవ ప్రాయశ్చిత్తం