పుట:Punitha Matha.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్ల బిడ్డలా మెలుగు తున్నావా?" అని అడిగిందట. మనం కూడ ఏబ్రాసి పనులు చేసినపుడెల్ల మరియమాతపట్ల బిడ్డల్లా మెలగడం మాని వేస్తుంటాం. ఈ దౌర్భాగ్యానికి గురికాకుండా వండాలని కూడా ఆ తల్లినేఅడుగుకుందాం.

4. రక్షణమాత

రెండవ శతాబ్దపు భక్తుడు ఇరెనేయుస్ "ఏవ అవిధేయురాలై చావు తెచ్చిపెట్టుకుంది. మనకూ చావు కలిగించింది. కాని మరియు దూత వాక్యానికి విదేయురాలై రక్షణం సంపాదించుకుంది. నరజాతి కంతటికీ రక్షణం ఆర్జించి పెట్టింది. ఏవ తన అవిధేయత వలన మనకు ఓ వురి తగిలించిపోయింది. మరియు తన విధేయత వలన ఆ వురి తొలగిచింది. ఆ తొలికన్య అవిశ్వాసంతో మనకు ఓ ముడి పెట్టి పోయింది. ఈ మలికన్య విశ్వాసంతో ఆ ముడి విప్పింది" అని వ్రాశాడు. మరియ రెండవయేవ. ఆ తొలి యేవ మన పతనానికి కారణమైనట్లే ఈ మలియేవ మన ఉద్ధరణానికి కారణమైంది. కనుక ఈమె రక్షణమాత. ప్రస్తుతం రక్షణమాతను గూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఇద్దరు ఏవలు

తొలి ఆదాము పాపంచేశాడు. అతడు మన నరజాతికి శిరస్సు. కనుక అతని పాపం మనకూ సంక్రమించింది. అతని వలన మనమంతా పతనమైపోయాం. ఈ పాపానికి పరిహారం చేయడం కోసమే రెండవ ఆదాము క్రీస్తు వచ్చాడు. ఆ తొలి ఆదాము పాపంలో ఓ ప్రీ కూడ పాల్గొంది. ఆమె పాపం దానంతటదే మనలను నాశంజేసి వుండదు. ఆదాము పాపం చేయకుండా ఏవ మాత్రమే పాప్తg చేసినట్లయితే మనం పతనమై