పుట:Punitha Matha.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరలోకంలోని పిత మనతండ్రి ఔతాడు. క్రీస్తు మన పెద్దన్న ఔతాడు. మరియమాత మానవుల తల్లి అవుతుంది. ఈ తల్లిని మనం స్తుతించి మహిమపరచాలి. ఆమె మహిమలన్నింటిలోను గొప్ప మహిమ దైవమాతృక గావడం. ఈ మాతృత్వాన్ని బట్టే స్త్రీ లందరిలోను మరియ ధన్యురాలు. సమస్త జాతులూ ఆమెను భాగ్యవతి అని కొనియాడతాయి. కొంతమంది భక్తులు దేవమాత వద్దనుండి నిత్యం అవీ యివీ అడుగుకొంటూ వుంటారు గాని, ఆమె మహిమనూ, మాతృత్వాన్నీ స్మరించనే స్మరించరు. ఎవడో వొకడు నిత్యం మంగళవార్త జపంలో రెండవభాగం మాత్రమే చెప్పకునేవాట్ట! ఈ జపంలో మొదటి భాగం మరియును సుతిస్తుంది. రెండవభాగం ఆయూ వునవులను అడుగుకుంటుంది. అతడు మరియమాత నుండి మనవులు పొందితే చాలు, ఆమెను స్తుతించటం దేనికిలే అనుకున్నాడు. మన ప్రవర్తన ఈలా వుండకూడదు.

మరియమాత ఆనాడు లోకానికి క్రీస్తు నందించింది. ఈనాడు మనకూ ఆ క్రీస్తు నందించమని ఆ తల్లిని అడుగుకోవాలి. ఆమెను కొనియాడుతూ "నీ గర్భఫలం ఆశీర్వదింపబడును గాక” అంటాం. మరియ అనే చెట్టు క్రీస్తు అనే మంచి పండును కాసింది. ఆ పండును సంపాదించుకొంటే మనమూ ధన్యులమౌతాం. కనుక ఆ పండుకోసం ఆ తల్లిని అడుగు కోవాలి.

భక్తుడు బెర్నార్డు జీవితంలో ఓ వృత్తాంతం విన్పిస్తుంది. బెర్నార్డు మరియ భక్తుడు. ఓ నాడు అతడు మరియమాత మీద సుమ్మర్లు పడుతూ "నీవు నా పట్ల తల్లిలా మెలగడం లేదు కదా?" అన్నాట్ట. వెంటనే మరియు అతని మాటలత్తీర్రు సవరిస్తూ "నీవు మాత్రం నా