పుట:Punitha Matha.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూసివేయబడింది –44, 12. ఇక నరులెవ్వరూ దానిలో ప్రవేశింప లేరు. అలాగే మరియు గర్భమూ ఓమారు క్రీస్తు జన్మించాక పూర్తిగా మూసివేయబడింది. ఇక ఆమెకు వేరే బిడ్డలంటూ కలుగలేదు.

క్రీస్తు మృతశరీరాన్ని రాతి బండయందు తొలిచిన సమాధిలో వుంచారు. అంతకుముందు ఆ సమాధిలో ఎవరినీ ఉంచలేదు. క్రీస్తు తర్వాత ఇంకెవ్వరినీ ఉంచలేదు. అలాగే కన్యమాత గర్భంకూడాను. క్రీస్తు జన్మింపక ముందుగాని, జన్మించినంకగాని ఆ గర్భంలో మరో శిశువు నెలకొనలేదు. క్రీస్తు సమాధిరాతిని ఛేదించకుండానే వెలుపలకు వచ్చాడు. గది తలుపులు తీయకుండానే గదిలోపల ప్రవేశించాడు. అలాగే ప్రభువు మరియ కన్యత్వం చెడకుండానే ఆమె గర్భంలో ప్రవేశించాడు. కన్యత్వం చెడకుండానే ఆమె గర్భం నుండి వెలువడ్డాడు.

మామూలుగా కన్య తల్లి కాలేదు, తల్లి కన్యగా వుండలేదు. ఐనా మరియు మాత్రం కన్య, తల్లి కూడ. ఆమె కన్యగా వుండిపోయింది తన్ను తాను దేవునికి సమర్పించు కొనడం కోసం అన్నాం. తాను మాతృమూర్తి కావడం ద్వారా ఈ సమర్పణ భావం ఫలసిద్ధి . తన్ను తాను అంకితం చేసికొనిన దేవుణ్ణి అధికానురాగంతో ప్రేమించింది. పైగా కన్యగా వుండడం వల్ల ఆమె హృదయం అవి భక్తంగా వుండిపోయింది. కనుక మరియు తన దేవుడు, పుత్రుడు ఐన క్రీస్తుని కన్యా హృదయంతోను, మాతృ హృదయంతోను ప్రేమించిందని చెప్పాలి. 5. కన్యమరియ బోధించే సత్యాలు ఈ సందర్భంలో కన్య మరియ మనకు మూడు సత్యాలను జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, కన్యత్వం రాబోయే మోక్ష సామ్రాజ్యపు