పుట:Punitha Matha.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవితాన్ని సూచిస్తుంటుంది. వివాహం ద్వారా బిడ్డలను కంటాం. కాని ఈలా పుట్టిన నరులకు మరణం తథ్యం. ఐతే కన్యత్వం మరణాన్ని జయించే మోక్ష జీవితాన్నీ ఉత్థాన జీవితాన్నీ సూచిస్తుంది - లూకా 20,34-36. కనుక వివాహ జీవితం మరణానికీ, కన్యత్వం జీవానికీ సాంకేతికంగా వుంటాయి.

రెండవది, కన్యత్వమంటే దేవునికి సమర్పితం కావడం. దేవుని సన్నిధిలో నడవడం. ఆ దేవునికి పరిచర్యం చేయడం. ఆ దేవుని కోసం తోడిప్రజలను ఆదరించడం. కన్య భగవంతునికి నివేదిత. కావున పవిత్ర మూర్తి. సమర్పణమే కన్యత్వపు ప్రధాన విలువ.

మూడవది, కన్యత్వాన్ని మనంతట మనం పాటించలేం. ఆది భగవంతుడు అనుగ్రహించే వరం. మొదటి ధన్యవచనం సూచించే దారిద్ర్య మనస్కులు దేవునివద్ద నుండి పొందే భాగ్యం - మత్త 5,3. కనుక మనం దీన భావంతో ఈ భాగ్యాన్ని దేవుని వద్దనుండి అడుగుకోవాలి.

6. కన్యమాతపట్ల భక్తిభావాలు

కన్యాజీవితం జీవించడంలో, పరిశుద్ధ జీవితం గడపడంలో కన్యమరియ మనకు ఆదర్శంగా వుంటుంది. ఈ పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగా వచ్చే శోధనలను జయించడానికి ఆ తల్లి సహాయ పడుతుంది. కన్యమరియు వినయమూ మర్యాదా ఆమె కన్యత్వాన్ని కాపాడాయి. ఆనాడు ఆమెను చూచినపుడు ఎవరికీ కామభావాలు కలుగలేదు. ఆమె ఆకారమూ, ప్రవర్తనమూ ఇతరులలో కూడ పరిశుద్ధ భావాలు కలిగించేలా వుండేవి. మనం కూడ ఈలాగే విశుద్ధ జీవితం జీవించేలా సాయపడమని ఆ తలిని అడుగుకుందాం.