పుట:Puneetha Paul bodhalu 2.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాల్పడ్డాడు. పూర్వం బాధామయ సేవకుడు ఈలా మరణించాడు. క్రీస్తు ఈ సేవకుని పోలినవాడు.

9. క్రీస్తు వినయానికి మెచ్చుకొని తండ్రి అతన్ని అధికంగా హెచ్చించాడు. అతన్ని ఉత్థానంజేసి మహిమ పరచాడు. అన్ని నామాలకంటే గొప్పనామాన్ని అతనికి ప్రసాదించాడు. అది "ప్రభువు" అనే నామం. దీనికి హిబ్రూలో యూవే అనీ, గ్రీకులో కూరియోస్ అనీ పేరు. ప్రభువు అనే పేరు పూర్వవేదంలో తండ్రికి మాత్రమే చెల్లుతుంది. ఆ బిరుదాన్ని తండ్రి క్రీస్తు కిచ్చి సత్కరించాడు. అనగా అతడు తండ్రికి సరిసమానమయ్యాడు. వినయంవల్ల బానిస ప్రభువయ్యాడు. ఇక్కడ ప్రభువు అంటే సర్వసృష్టికి పాలకుడు అని అర్థం.


10. మూడులోకాల్లోని ప్రాణులు అనగా స్వర్గంలోని సన్మనస్కులూ, భూమిమీది నరులూ, పాతళంలోని మృతులూ క్రీస్తుకి మోకాలు వంచి దండంపెడతారు.

11. తండ్రి కీర్తి కొరకే క్రీస్తు ప్రభువు అయ్యాడని అందరూ ప్రకటిస్తారు. క్రీస్తు మహిమ తండ్రికే కీర్తిని చేకూరుస్తుంది. క్రీస్తు సర్వసృష్టికి అధిపతి. తండ్రికి సరిసమానుడు. ఐనా ఇద్దరు దేవుళ్లు కాదు, ఒకే దేవుడు.

ఆదాము గర్వం ద్వారా వునకు పావమూ చావు తెచ్చిపెట్టాడు. కాని క్రీసు వినయం ద్వారా మనకు రక్షణాన్ని తెచ్చిపెట్టాడు.

పూర్వం బాధామయ సేవకుడు శ్రమలు అనుభవించి మహిమను పొందాడు - యెష53. ఆ సేవకుడు క్రీస్తునే సూచిస్తాడు.

పిలిప్పీయులు క్రీస్తులాగ వినయమూ, స్వార్థత్యాగమూ, సేవాగుణమూ అలవర్చుకోవాలని పౌలు హెచ్చరించాడు. ఈ గీతం క్రీస్తు దైవత్వాన్ని కాక అతడు నేర్పిపోయిన నైతిక సూత్రాలను వర్ణిస్తుంది. ఈ పాట పౌలు సుప్రసిద్ధ బోధల్లో వొకటి. ఇప్పడు మనకు కూడ ప్రేరణం పుట్టిస్తుంది. పాఠకులు దీన్ని పలుసార్లు భక్తితో మననం జేసికోవాలి.