పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కదిలించింది. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మళ్ళీ సీమాంధ్రనాటకాలను మీడియా రక్తికట్టించింది. దీంతో డిసెంబర్‌ 28న కేంద్రం మరో ప్రకటన చేయడంతో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది.మిలియన్‌మార్చ్‌, ఛలో అసెంబ్లీ, సాగరహారం, విద్యార్థిగర్దన వంటి మహాసభలను తలపెట్టి కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండ జేసింది. తెలంగాణ జెఎసిలు, పార్టీలు ఒక్కటై తమ లక్ష్యం తెలంగాణ తప్ప వేరొకటి కాదన్నంతగ (ప్రభావితం చేసినయి. 2009 నవంబరు మొదలు ఈ ఉద్యమంలో లెక్కలేనంత మంది తెలంగాణ బిడ్డలు అసువులుబాసిండ్రు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 450మంది అని చెప్పుతున్నప్పటికి ఈ లెక్క వేయికి మించి ఉంటుందనేది ఒక అంచనా. అయితే 1952, 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, ఉద్యమకారులు పోలీసు కాల్పుల్లో చనిపోతే, 2009 ఉద్యమంలో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చి ఆత్మబలిదానాలు చేసుకుండ్రు. ఏదైతే ఏముంది నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల నినాదం ఒక్కటైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకులంగ ప్రకటన చేసింది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ దశలో హైద్రాబాద్‌ను పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగ చేయాలని కాంగ్రేసు ప్రతిపాదించిన నేపథ్యంలో తెలంగాణ నాయకులు మానవత్వం నిండిన మనసుతో పెద్దమనుషుల్లా వ్యవహరించిండ్రు. కాని గిచ్చి కయ్యం పెట్టుకునే ఆంధ్ర నాయకులు అతిగా ్రవర్తించిండ్రు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు నుంచి వేరుపడిన సంధర్భంలో రాజాజి అప్పటికప్పుడే “గెటౌట్‌ ఆంధ్ర కుక్కల్లారా అంటూ ఉన్న ఫలంగ మద్రాసును ఖాలి చేయించిండు. ఇక్కడ ఆ పరిస్థితి లేకుండ వాళ్ళు కోరుకున్నదానికి తెలంగాణ నాయకత్వం అంగీకరించింది. రాజధాని ఏర్పాటు జరిగే వరకు ఉమ్మడిగ ఉండడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రులు హైద్రాబాద నడిగడ్డమీద 'సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ ఆంధ్రబుద్దిని ప్రదర్శించింద్రు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చేష్టలతో సభని గందరగోళ పరిచిండ్రు. తెలంగాణ విద్యార్థుల్ని గాయపరిచిండ్రు. తెలంగాణ సీమాంధ్ర ప్రజల మధ్య విభజన రేఖ గీసిండ్రు. అనేక పోరాటాలు, ఆత్మబలిదానాలు చేసి

అంబటి వెంకన్న * 7