పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకమాట

ప్రపంచ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఘట్టాలు అత్యంత బలమైనయి. (ప్రజాస్వామికమైనయి. ఈ పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు. 1952 ముల్కీ ఉద్యమం నించి మొదలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన అనేక సంఘటనలు ఉద్యమాన్ని ఉరకలెత్తించినయే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ విప్లవాల సరసన చేరిందంటే అతిశయోక్తి కాదు. హైద్రాబాద్‌ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం చేయబడిన తర్వాత తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టిన స్థానికేతరులు వెళ్ళిపోవాలని చేసిన ముల్మీ ఉద్యమం సందర్భంగ ఏడుగురు విద్యార్థులు పోలీసుల కాల్పుల్లో చనిపోయిండ్రు. ఆ తర్వాత విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని సీమాంధ్ర నాయకులు వేసిన ఎత్తుగడలకు కేంద్రం తలవంచింది. 1956లో ఫజల్‌ అలీ కమీషన్‌ నివేదికను కాలరాసి, తెలంగాణ ప్రజల అభీష్టాన్ని లెక్కచేయకుండ బలవంతంగ సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌గ అవతరించిన మరుక్షణం నుంచే తెలంగాణ మీద సీమాంధ్ర నాయకుల ఆధిపత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేసిన 1969 ఉద్యమం రక్తసిక్తమైంది. వలసపాలకులు తెలంగాణ ఉద్యమకారుల మీద కర్మశంగ కాల్పులు జరిపి 870మంది విద్యార్థుల ప్రాణాల్ని బలి తీసుకుంద్రు. ఉత్తగనె అట్లతద్దెనాడు అత్తా అల్లుడు సరసమాడినట్టు 'జై ఆంధ్ర” ఉద్యమంతో కేంద్రాన్ని బెదిరించిండ్రు. 1975లో ఆరుసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణకు ఇచ్చిన రాజ్యాంగ రక్షణలను నాశనం చేసిండ్రు. నివురుగప్పుకున్న నిప్పులా ఉన్న తెలంగాణ నేల 1996లో ఒక్కసారిగ బగ్గుమన్నది. ప్రత్యేక తెలంగాణ కోసం నడుముగట్టింది. తెలంగాణ కవులు, కళాకారులు, మేథావులు పెద్దఎత్తున ముందుకొచ్చిండ్రు. ప్రాణాలకు తెగించి కొట్లాడడానికి సిద్ధమైండ్రు. ఇంతలో కేసీఆర్‌ 2001లో తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించడం వల్ల ఇటు ఉద్యమాలు, అటు రాజకీయాలు రెండు రకాలుగ తెలంగాణ పోరాటం బలపడింది. నీళ్ళు నిధులు, నియామకాలల్లో తెలంగాణకు జరుగుతున్న దోపిడిని అద్దుకట్టలు వేసే విధంగ ఉద్యమం నిర్మించబడింది. అనేక పోరాటఘట్టాల అనంతరం కేసీఆర్‌ ఆమరణ దీక్ష ఢిల్లీని

6 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం