పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇచ్చిండ్రు. నిజాం అలీఖాన్‌ 1765లో తన రాజధానిని బెరంగాబాద్‌ నుండి హైద్రాబాద్‌కు మార్చిండు. రాజధాని మార్చు జరగడం వలన ఇక్కడి సంస్కృతిలోను, భాషలోను అనేక మార్పులు చోటు చేసుకున్నయి. ఉర్జూ అధికార భాష కావడంతో ఉత్తరాది నుంచి అనేక మంది ఉర్దూ వచ్చిన పండితులు హైద్రాబాద్‌కు రావడం జరిగింది. దీనివల్ల 'ముల్మీ' సిద్దాంతానికి తెరలేసింది. అఫాకీలు అనబడే పర్షియన్‌ అధికారులకు వ్యతిరేకంగ బహమనీల కాలంలోనే ముల్కీ విధానం బయటికి వచ్చింది.

సికిందర్‌ జా (1803-1829): 1803 నుంచి 1829 వరకు పరిపాలించిన సికిందర్‌ జాని మూడవ అసఫ్‌జా అని పిలిచేవాళ్ళు. ఈయన కాలంలో జాగీర్జారులు పెద్దఎత్తున తిరుగుబాటు చేసిండ్రు.

నాసిరుద్దాలా బహదూర్‌ (1829-1857): 1829 నుంచి 1857 వరకు పరిపాలించిన నాసిరుడ్దాలా బహదూర్‌ కాలంలో దేశంలో అనేక ఉద్యమాలు తలెత్తినయ్‌. ముఖ్యంగ బ్రిటీష్‌ ప్రభుత్వ కార్యకలాపాలను నిరసిస్తూ దేశవ్యాప్త పోరాటాలు కొనసాగినయ్‌. ఇట్ల రాజ్యం దివాళ తీస్తున్న సమయంలో తురాజ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌ అనే బిరుదుతో దివాన్‌ (ప్రధాని)గా అధికారాన్ని చేపట్టిండు.

సాలార్‌జంగ్‌ (1858-1888): అప్పుల్లో కూరుకుపోయిన నిజాం రాజ్యంలో వరుస కరువులు రావడంతో ఎంతో మంది చనిపోయిండ్రు. ఈ పరిస్థితులను ఎదుర్శోనేందుకు 19వ శతాబ్ధపు చివరి భాగంలో హైద్రాబద్‌ తన అభివృద్ది పంథాను మార్చుకుంది. దానికి ప్రధానమైన కారణం 1858లో ముఖ్దారుల్‌ ముల్క్‌ సర్‌ సాలార్‌జంగ్‌ బహదూర్‌ ప్రధానమంత్రి (దివాన్‌) గా నియమించబడడం. సాలార్‌జంగ్‌ చేపట్టిన సంస్కరణలు కొన్ని జాగిర్జారులకు, దేశముఖ్‌లకు ఎంతో బలాన్ని ఇచ్చినయి. నాటి నిజాం సంస్థానంలో కోటి ఎనబై లక్షల జనాభాలో 1100 మందికి పైగా జాగీర్జారులు ఉండేవారు. సైనిక వ్యయం పెరగడంతో ప్రజల మీద పన్నుల భారం మోపిండ్రు. దాదాపు 40శాతం భూమి జాగీర్జారులు, భూస్వాముల చేతుల్లోనే ఉండేది. హైద్రాబాద్‌ రాష్ట్ర విస్తీర్ణం 82,698చ. మైళ్ళు అయితే 60,886చ. మైళ్ళు మాత్రమే దివానీ లేదా ఖల్సా ప్రాంతంగ ఉండేది. అంటే నిజాం ప్రభుత్వ పాలనలో ఉండే భూమి. జాగీర్జారులు దేశముఖ్‌లు నిజాంకు తెలిసి కొన్ని తెలియక కొన్ని అనేక విధాల పన్నుల రూపంలో ప్రజలను పీడించేవాళ్ళు. వెట్టిచాకిరి చేయించుకునే వాళ్ళు. ఇలాంటి విషయాలను కొన్నింటిని మినహాయిస్తే 1888 వరకు నిజాం రాజుల వద్ద సాలార్‌జంగ్‌ దివాన్‌గా అనేక సంస్కరణలు చేపట్టిండు. హైద్రాబాద్‌ రాష్ట్ర అభివృద్దికి ఆయన ఎనలేని సేవలు చేసిండు.

అంబటి వెంకన్న * 11