పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవ్టల్‌ ఉద్దౌలా (1857-1869): నాసిరుద్దౌలా చనిపోవడంతో ఆయన పెద్దకొడుకు అప్టల్‌ ఉద్దౌలా రాజ్య సింహాసనాన్ని అధిష్టించిండు. 1857 నుంచి 1869 వరకు ఆష్టలుద్దాలా పాలించాడు. హైద్రాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ను స్థాపించిన సాలార్‌జంగ్‌ ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగులను హైద్రాబాద్‌కు ఆహ్వానించిండు. ఇతని కాలంలోనే ముల్మీ ఉద్యమాలు జరిగినయి. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన సంధర్భంలో ఇతడు ఆంగ్లేయులకు సహకరించిండు.

మీర్‌ మహబూబ్‌ అలీ పాషా(1869-1911): మహబూబ్‌ అలీఖాన్‌1869 నుంచి 1911 వరకు పాలించిండు. ఈయన ఆరవ అసఫ్‌జాహీగా పరిపాలన కొనసాగించిండు. ఇతని కాలంలోనే 1880లో ఫార్సి భాషకు బడులుగా ఉర్చూ అధికార భాషగ మారింది. స్థానికేతరులకు జీతభత్యాలు ఎక్కువగా ఉండడం వలన వాటి విషయంలో 1888లో ప్రత్యేక గెజిట్‌ని ప్రకటించింది. ఈ గెజిట్‌ ప్రకారం ఉద్యోగాలన్ని అర్జతల ప్రకారం ముల్మీలకే ఇవ్వాలని నిర్ణయించింది. ఇతని కాలంలో కూడా కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈయన కాలంలో సొ 'లార్జంగ్‌ కొంతకాలం, ముల్మీల పక్షపాతి స్వయంగ కవి అయిన కిషన్‌ పర్‌షాద్‌ కొంతకాలం దివాన్‌లుగా పనిచేసిండ్రు.

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (1911-1948): హైద్రాబాద్‌ రాష్ట్రం అనేక సంఘర్షణలకు లోనై ప్రజల్లో భావావేశం కట్టలు తెంచుకుంటున్న సమయంలో మహబూబ్‌ అలీఖాన్‌ హఠాత్తుగ చనిపోవడంతో అతని కొడుకు ఉస్మాన్‌ అలీఖాన్‌ 25 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్టించిండు. ఈయన పూర్తిపేరు నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌. అసఫ్‌జాహీలలో చివరిపాలకుడైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మంచి సాహిత్య అభిమాని ఉర్జూలో గజళ్ళు కూడ రాసిండు. 1911 సెప్టెంబర్‌ 17న అధికారం చేపట్టి 1948వరకు పరిపాలించిండు. పదహారు జిల్లాలతో, ఒక కోటి డెబ్బయ్‌ లక్షల మంది జనాభా కలిగిన హైద్రాబాద్‌ సంస్థానం భారతదేశంలోనే అతి పెద్ద సంస్థానం. ఇక్కడ ఉస్మాన్‌ అలీఖాన్‌ చేసిన కృషి ఫలితంగ అనేక పరిశ్రమలు స్థాపించబడి హైద్రాబాద్‌ అన్ని రంగాలలో అభివృద్ది చెందింది. ప్రధానంగ గ్లాసు, కాగితం, అగ్గిపెట్టెలు, గుండీల వంటి పరిశ్రమలు స్థాపించబడినయి. ఉస్మాన్‌సాగర్‌, నిజాంసాగర్‌, హిమాయత్‌సాగర్‌ వంటి చెరువులను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడినయి. ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంలోనే విద్య, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. నిజాం తన పేరు మీదనే 1918లో ఉర్చూ బోధన భాషగ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిండు. 1919లో మీర్‌


12 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం