పుట:Pratha Nibandhana Kathalu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దిసమొలను కప్పుపకొన్నారు. దేవుడు మీరు నేను తినవద్ధన్నపండ్లు ఎందుకు తిన్నారని ప్రశ్నింపగా ఏవ పాము మీదా, ఆదాము ఏవ మీదా నేరం మోపారు. దేవుడు కోపించి ముగ్గురినీ శపించాడు. పాము పొట్టతో నేలమీద ప్రాకాలి. ఏవ పురిటి నొప్పలు భరించాలి. భర్త అధికారానికి లొంగి వుండాలి. ఆదాము నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకోవాలి. దేవుడు ఆదాము ఏవలను తోటనుండి వెళ్లగొట్టాడు. ఈలా నరులు దేవుడంతటివాళ్లు కావాలనుకొని నాశం తెచ్చుకొన్నారు.

4. కయీను హేబెలును చంపడం - ఆది4,1-12

కయీను, హేబెలు ఆదామేవల కుమారులు. కయినాను రైతు. అతడు పొలంలో పండిన పంటను దేవునికి కానుక పెట్టాడు. కాని అతని హృదయం మంచిది కాదు. కనుక దేవుడు ఆ కానుకను అంగీకరించలేదు. హేబెలు గొర్రెల కాపరి. అతడు గొర్రెపిల్లలను దేవునికి అర్పించాడు. దేవుడు వాటిని ప్రీతితో స్వీకరించాడు. అన్నకు తమ్ముని మీద అసూయ పుట్టింది. అతన్ని పొలానికి తీసికొనిపోయి చంపివేశాడు. ఇంత అన్యాయం జరిగింది చూడమని హేబెలు ప్రాణం దేవునికి మొరపెట్టింది. దేవుడు నీవు ఇల్లూ వాకిలీ లేకుండ దేశాల వెంటబడి తిరుగుతావు అని కయీనుని శపించాడు.

5. నోవా వోడను కట్టడం - ఆది 6-8

లోకంలోని నరులంతా దుష్టులైపోయారు. దేవుడు జలప్రళయం ద్వారా నరులను నాశం చేసి క్రొత్త సృష్టి చేయాలనుకొన్నాడు. ఆరోజుల్లో నోవా వొక్కడు మాత్రం దేవుని ಅజ్ఞಲು పాటించాడు. అతడు దేవునికి నచ్చాడు. ప్రభువు అతన్ని పెద్ద వోదా కట్టమని ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినట్లే నోవా వోడను నిర్మించాడు. అతని కుటుంబమంతా వోడలోనికి వచ్చింది. ఆ భక్తుడు ప్రతిజాతి మృగాలనుండీ, పక్షులనుండి ఒక ఆడు మగ జంటను గూడ ఓడలో చేర్చాడు. పనంతా ముగిశాక దేవుడు నలభై రోజుల పాటు కుండపోతగా వర్షం కురిపించాడు. ప్రపంచమంతా జలమయ మైంది. కొండలమీద పదిహేను అడుగుల యెత్తున నీళ్లు నిల్చాయి.