పుట:Pratha Nibandhana Kathalu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాత నిబంధన కథలు

1. లోకసృష్టి - ఆది 1,3-24

దేవుడు ఆరు రోజుల్లో విశ్వాన్ని సృష్టించి ఏడవరోజు విశ్రాంతి తీసికొన్నాడు. మొదటిరోజు వెలుగుని పుట్టించాడు. రెండవరోజు ఆకాశాన్ని చేశాడు. మూడవరోజు భూమినీ సముద్రాన్నీ వేరుబేశాడు. నేలమీద చెట్లను గూడ మొలిపించాడు. నాల్గవరోజు సూర్యచంద్రులనూ నక్షత్రాలనూ చేశాడు. ఐదవరోజు జలప్రాణులనూ ఆకాశంలో ఎగిరే పక్షులనూ చేశాడు. ఆరవ రోజు భూమిమీద సంచరించే జంతువులను చేశాడు. అన్ని ప్రాణులకంటె వెనుక నరులను సృజించాడు. ఏడవరోజు దేవుడు విశ్రాంతి తీసికొన్నాడు.

2. ఆది దంపతులు - ఆది 2, 7-25

దేవుడు ఆరవ రోజున నరులను సృజించాడు. అతడు నేలమట్టిని తీసికొని దానిని బొమ్మగా మలిచాడు. దాని ముక్కు బెజ్జాలలోనికి ప్రాణవాయువును ఊదాడు. అది జీవించే ప్రాణి ఐంది. అతడే ఆదాము, తొలి నరుడు.

దేవుడు నరుడు వొంటరిగా వుండడం మంచిది కాదు, అతనికి తోడుగా వుండడానికి స్త్రీని గూడ చేద్దాం అనుకొన్నాడు. ఆదాముకి గాఢ నిద్ర కలిగించి అతని ప్రక్కటెముకను తీసి దాన్ని స్త్రీగా రూపొందించాడు. ఆమె పేరు ఏవ. ఆదాము ఆ స్త్రీని చూచి సంతోషించాడు. ఆమెను భార్యగా స్వీకరించాడు. దేవుడు వారిని అన్ని ఆనందాలు కల ఏదెను తోటలో వుంచాడు. ఆనాటి నుండి వివాహ వ్యవస్థ ప్రారంభమైంది.

3. ఆది తల్లిదండ్రుల పాపం -ఆది 3

దేవుడు ఆదాము ఏవలను ఏదెను తోటలో వుంచాడు. ఆ తోట మధ్యలో వున్న జ్ఞానవృక్షం పండ్లు మాత్రం తినవద్దని ఆజ్ఞ యిచ్చాడు. కాని పాము రూపంలో వున్న పిశాచం మీరా పండ్లు తింటే దేవునికి సరిసమానం ఔతారు సుమూ అని మభ్యపెట్టింది. దాని మూటలు నమ్మి ఏవ ఆ చెట్టు పండ్లు కోసికొని తింది. కొన్ని భర్తకు కూడ ఇచ్చింది. ఆ ఫలాలు తినగానే వారికి శాస్క్రో కలిగింది. చెట్ల ఆకులు కోసి