పుట:Prasarapramukulu022372mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

89

గయోగ నాటికలు, వ్యాసాలు, ప్రసంగాలు, నాటకాలు ఆకాశవాణి ద్వారా ప్రహరితమయ్యాయి. ఆకాశవాణి ఉగాది కవి సమ్మేళనాలలో ఆయన పాల్గొనడం ఒక హైలైట్. 1979 లో వారికి రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు లభించింది. 1973లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు.

1971 లో శ్రీశ్రీ షష్టిపూర్తి సంఘం శ్రీశ్రీ సాహిత్య సంపుటాలను ప్రచురించింది. 'విరసం' ఆవిర్భావానికి ఆయన కారకులు. తొలి అధ్యక్షులు. 1966 లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు పొంది సోవియట్ యూనియన్‌లో పర్యటించారు. 'గర్జించు రష్యా', అన్న వీరి కవిత ప్రసిద్ధం. 1930-33 మధ్య వ్రాసిన కవితలు మహాప్రస్థానంగా ప్రకటించారు. అభ్యుదయ సాహిత్యో ఉద్యమానికి రథసారది ఆరుద్రతో బాంధవ్యం వుంది. తన 74వ ఏట (15-6-83) శ్రీశ్రీ కాలధర్మం చెందారు.

అవిభక్త మదరాసు రాష్ట్ర శాసనమండలిలో సభ్యులుగా శ్రీశ్రీ వ్యవహరించారు. ఆంధ్రంలోను, ఆంగ్లంలోను సమానంగా సామర్థ్యం చూపగల దిట్ట. 1946లో 'వారం వారం' అనే వచన రచనల సంకలనం, 1956లో మరో ప్రపంచం ఇవే రేడియో నాటికల సంపుటి. 1957లో చరమరాత్రి కథల సంపుటి ప్రచురించారు. ప్రానక్రీడల పేరుతో కార్టూన్ కవిత్వానికి నాంది పలికింది శ్రీశ్రీ ------- అనే హాస్యధోరణిలో కవితలు వ్రాశారు. 1943లో అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షులయ్యారు. సాహిత్యోద్యమాలతో నిరంతరం అనుబంధం పెంచుకున్న వ్యక్తి శ్రీశ్రీ. ఇరవై శతాబ్ది తెలుగు సాహిత్యంలో విలక్షణ కవితాయుగ ప్రవర్తకుడు శ్రీశ్రీ.

కొంగర జగ్గయ్య :

కంచు కంఠంతో ఆంధ్ర సినీ ప్రేక్షకులను మూడు దశాబ్దాలు అలరించిన కొంగర జగ్గయ్య రేడియోలో వార్తలు చదివారంటే ఈ తరానికి తెలియదు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయ్యే తెలుగు వార్తలను ఒక సంవత్సరంపాటు 1947 ప్రాంతాలలో చదివారు జగ్గయ్య. జగ్గయ్య దుగ్గిరాల (గుంటూరు జిల్లా) లో 1920 దశకంలో జన్మించారు. బి.ఏ. పూర్తిచేసి రేడియోలో పనిచేస్తున్న కాలంలో సినీ