పుట:Prasarapramukulu022372mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ప్రసార ప్రముఖులు.

శ్రీరాములు, అద్దంకి మన్నార్, వావిలాల రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, ఏడిద గోపాలరావు - మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి వార్తలు చదవడంతో తెలుగువారి హృదయాలకు సన్నిహితులయ్యారు.

ప్రస్తుతం వార్తలు డిల్లీ నుండి సమ్మెట నాగ మల్లేశ్వరరావు, గద్దె దుర్గారావు, యండ్రపాటి మాధవీలత, వడ్లమూడి రాజేశ్వరి చదువుతున్నారు. వీరుగాక క్యాజువల్‌గా మరికొందరు వార్తలు చదువుతున్నారు. నరసింగరావు, న్యూస్ రీడర్‌గా కొంతకాలం పనిచేసి వ్యాధిగ్రస్తులై మరణించారు. సూర్యదేవర ప్రసన్నకుమార్ వార్తలు చుదువుతున్నారు.

వనమాలి ప్రసాద్ డైరక్టర్‌, వార్తా విభాగంగా ఢిల్లీలో పనిచేశారు.

ఏడిద గోపాలరావు 1996 సెప్టెంబరు 30 న ఢిల్లీ వార్తా విభాగంలో న్యూస్ రీడర్ గా పదవీ విరమణ చేయడంతో ఒక పాత శకం అంతరించింది. రంగస్థల నటుడుగా, దర్శకుడుగా, కార్యకర్తగా ఆయనకు మంచిపేరు. ఢిల్లీలో 'సరస నవరస' అనే నాటక, సాంస్కృతిక సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలు పోషించారు. వందకు పైగా నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ నాటక అకాడమీ గౌరవ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 'ధియేటర్ ఆర్ట్స్‌'లో డిప్లొమా పొందారు. ఉత్తరాదిలో దక్షిణాది ప్రముఖుల పేర వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించారు. మాస్కో రేడియోలో 1982-86 మధ్యకాలంలో పనిచేశారు. అక్కడ వారికి పత్ని వియోగం కలిగింది. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వీరి సోదరులు. 1996 సెప్టెంబరులో వీరు పదవీ విరమణ చేశారు.

శ్రీశ్రీ (1910-1983) :

1910 జనవరి 2న విశాఖపట్టణంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావు ఆధునికాంధ్ర కవిత్వంలో విశిష్టకవి. ప్రకృతి శాస్త్రంలో మదరాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన తర్వాత కొన్నాళ్ళు పత్రికలలో ఉపసంపాదకులుగా పనిచేశారు. ఆ తర్వాత 1950లో చలన చిత్రరంగంలో చేరి విశిష్ట స్థానం సంపాదించారు. మాటలు, పాటలు వ్రాసి ప్రేక్షకుల ఆదరం సంపాదించారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి తెలుగు వార్తలు కొంతకాలం చదివేవారు.

శ్రీశ్రీ మొదటి కవితా సంపుటి ప్రభవ 1928లో ప్రచురితమైంది. మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి, మూడు యాభైలు కవితా సంపుటాలు ! + 1, చతురస్రం