పుట:Prasarapramukulu022372mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

17

5 ఏళ్ళు పనిచేసారు. నవలలు, కధలు ఏది వ్రాసినా ఆయన సునిశితహాస్యం కొట్ట వచినట్లు కనపడేది. పాటలు చెప్పడంలో ఆయన కొత్త తరహ సృషించారు. ఆయన వ్రాసిని కధలలో తెలుగు యింటి ఆడపడుచు దర్శనమిచేది. ఆయన కాంతం కధలు హైలైట్. కాంతం పాత్రకు జీవం పోసిన మహారచయిత ముని మాణిక్యం.

మన హాస్యం పేరుతో ఆయన చక్కని గ్రంధం వెలువరించారు. వక్రరేఖ, తిరుమాళిగ, దీక్షితులు కాంతం, నేను మా కాంతం (1933), కాంతం కైఫియత్, కాంతం కాపురం, మునిమాణిక్యం కథలు, రుక్కుతల్లి, శరధ్రాత్రులు, అన్నయ మంత్రి, మరపు, స్తుతి-ఆత్మస్తుతి, ఇల్లు-ఇల్లాలు, మంచివాళ మాట తీరులు, గాజుల సెట్టి, తల్లి ప్రేమ. వీరి రచనలలో ప్రసిద్ధం. తిరమాళిగా, రుకుతల్లి, దీక్షితులు నవలికలు-కరుణరసభరితాలు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరిని విశిష్ట సభ్యులుగా సత్కరించింది. కాంతం కధలు, 1927 లో కధాసంకలనంగా వెలువడింది. మునిమాణిక్యం గారి భార్య 1938 లో కాలధర్మం చెందింది. ఆ తర్వాత కాంతం, కాంతం వృద్ధాప్యం రచించారు.

పిల్లలకు, విద్యార్ధులకు సరిపడేలా అన్నయమంత్రి, వక్రరేఖ నవలలను రచించారు. తిరుగుబాటు అనే నాటకం వ్రాసారు. ఇంటావిడతో పోట్లాట, ప్రణయ కలహం, భార్యను లొంగదీసుకోవడం ఎలా - వంటి రచనలు హాస్యస్పోరకాలు. మధ్యతరగతి సంసారాల దాంపత్య జీవిత రహస్యాలను ఆయన సజీవ పాత్రలుగా సృషించారు. 1973 ఫిబ్రవరి 4 న మునిమాణిక్యం కాంతని కలవటానికి స్వర్గలోకం వెళ్ళారు. ఆయన కుమార్లు మునిమాణిక్యం రఘునాధ యాజ్ఞవల్క్య, 'మురయా' సంచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఫిలింపబ్లిసిటీ ఆఫీసరుగా చేసే పదవీ విరమణ చేశారు.

న్యాపతి రాఘవరావు దంపతులు

న్యాపతి రాఘవరావు (1905 - 1984)

రేడియో అన్నమయ్యగా ప్రసిద్ధి కెక్కిన రాఘవరావు 1905 వ సంవత్సరం లో బరంపురంలో జన్మించారు. అక్కడే 1921 లో మెట్రిక్యులేషన్ చదువుతుండగా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఫలింతంగా చదువుకు స్వస్తి పలికారు. కొంత