పుట:Prasarapramukulu022372mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ప్రసార ప్రముఖులు.

అనౌన్సర్‌ల జంటలు రెండున్నాయి. ఇలియాస్ అహమ్మద్, జ్యోత్స్న అనౌనర్లుగా నవలా రచయితలుగా పేరు తెచ్చుకొన్నారు.

అలానే సత్యనారాయణ, సీత అనౌన్సర్లుగా పేరు తెచ్చుకొన్న మరో జంట. నటుడుగా నాటక రచయితగా పేరున్న సత్యనారాయణ 1988లో అకాల మరణం పొందారు. హైదరాబాదులో పనిచేస్తున్న సుధామ, ఉషారాణి దంపతులు కార్యక్రమ నిర్వాహకులుగా పేరు గడించారు. సుధామ మంచి రచయిత : కవి.

విజయవాడ కేంద్రంలో మంజులూరి కృష్ణకుమారి దంపతులు మరో జంట. కృష్ణకుమారి కార్యక్రమ నిర్వాహకురాలిగా UPSC ద్వారా ఎంపికయ్యారు. విజయవాడ, విశాఖపట్టణ కేంద్రాలలో 10 స. లుగా పనిచేస్తున్నారు. కృష్ణకుమారి చక్కని రచయిత్రి. ఈమె వ్రాసిన అముద్రిత రచనకు NCERT వారి జాతీయ బహుమతి లభించింది. పన్నాల సుబ్రహ్మణ్యభట్, కృష్ణకుమారి ఆదర్శ దంపతులు. భట్ మంచి విమర్శకుడు, రచయిత, ప్రసార మాధ్యమంలో పట్టువున్న వ్యక్తి. చెణుకులు ద్వారా శ్రోతల్ని ఆకట్టుకుంటారు. కార్టూనిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. తెలుగు ప్రసారాలకు గూర్చి దారావాహికంగా ప్రసారం చేసి 'ప్రసార తరంగిణి' పుస్తకం ప్రచురించారు. 1996లో నేపథ్యంపేర 20 వారాలు దారావాహికంగా ఆధునిక నాటకంపై ప్రామాణిక గ్రంథం వెలువరించారు. వాదబంధం (1983), మార్గబంధం(1988) రూపకాలకు భట్ జాతీయస్థాయి బహుమతులు పొందారు.

N. బాబూరావు దంపతులు విజయవాడలో ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఝాన్సీ కె. వి. కుమారి కపయిత్రి. వచన కవితా సంపుటాలు వెలువరించారు. వీరిద్దరు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా నాలుగేళ్ళుగా నిజామాబాద కేంద్రంలో పనిచేస్తున్నారు.

మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు మరోజంట. వీరిద్దరు ప్రస్తుతము అనంతపురం కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులు. మహేశ్వర్ చక్కని కథకుడు. వీరిద్దరు విశాఖ, హైదరాబాదుల్లో వుండహా వివాహం అయింది. విశాఖ, విజయవాడలలో పనిచేసి అనంతపురం బదలీ అయ్యారు.