పుట:Prasarapramukulu022372mbp.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

107

కలగా కృష్ణమోహన్, పరిమిళ దంపతులు విజయవాడలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌లుగా వుంటూ వివాహం చేసుకొన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాదు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో విడిగా పనిచేస్తున్నారు. కృష్ణమోహన్ రూపొందించిన మాట-మౌనం 1988లో జాతీయస్థాయి బహుమతి పొందింది.

రాఘవరెడ్డి, అమృత దంపతులు ప్రస్తుతం తిరుపతిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, అనౌన్సర్లుగా వున్నారు. వీరు తొలుత అనంతపురంలో రిక్రూట్ అయ్యారు. అమృత తండ్రి శ్రీపులికంటి కృష్ణారెడ్డి 1992 అక్టోబరు - 95 అక్టోబరు మధ్యకాలంలో మూడేళ్ళు ఆకాశవాణి గౌరవసలహాదారుగా వ్యవహరించారు. రెడ్డి కవి, కథకుడు, మంచి భావుకుడు, చక్కటి మిత్రుడు.

వీరేగాక కలిసిమెలిసి పనిచేయడంవల్ల పరస్పరాకర్షితులై దంపతుల కన్న మిన్నగా ప్రవర్తించిన వారెందరో ఆ యా కేంద్రాలలో వున్నారు. వీరిని ప్రసార ప్రేమికులనవచ్చు, ఇది ఆకాశవాణి ప్రత్యేకత.