పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవమత యుద్ధకాలమున యూరోపు

11

పోపు గ్రిగొరీ VII. ఇతని వెనుకటి పేరు హిల్డిబ్రాండు. ఇతడు పోపుల నెన్నుకొసుటకొక క్రొత్తపద్ధతిని ప్రవేశ పెట్టెను. రోమన్ కేతలిక్కు ప్రపంచములో కార్డినలులు, మతాచార్యులలో వున్నతపదవియందున్న వారు. కార్డినలుల కళాశాల యొకటి సృష్టింపబడినది. దానికి పవిత్ర కళాశాల(Holy College) అని పేరు. ఈకళాశాలయే క్రొత్తపోపును ఎన్ను కొనును. క్రీ. వె. 1059 సంవత్సరమున ఈపద్ధతి ప్రవేశ పెట్టబడినది. నేటివరకూ బహుశా కొన్నిమార్పులతో అది జరుగుచునే యున్నది. నేడుకూడ, పోపు మరణించినప్పుడు కార్డినలుల కళాశాల వెంటనే సమా వేశమగును. వారు తాళమువేసిన ఒకగదిలో కూర్చుందురు. ఎన్నిక పూర్తియగువరకూ ఎవరూ లోపలినుండి బయటకుగాని, బయటనుండి లోపలికిగాని పోరాదు. తరుచు వారెన్నో గంటలాగదిలో, ఎట్టి నిర్ణయముసకురాలేక కూర్చుండేవారు. కాని వారు బయటికి రారాదు కాన చివరకు వారు ఒక అంగీకారమునకు వత్తురు. ఎన్నిక అయిన తోడనే తెల్లపొగ పైకిపంపుదురు. దీనినిచూచి బయటనున్న ప్రజలు సమావేశము పూర్తియైనదని తెలిసికొందురు.

ఎన్నికలవల్లనే పోపును ఏర్పాటుచేయుదురు. ఇట్లే పవిత్రరోమక సామ్రాజ్యచక్రవర్తినికూడ యెన్నుకొనుటకు ప్రారంభించిరి. కాని అతనిని ఎన్నుకొనువారు ప్రబలులగు ఫ్యూడల్ ప్రభువులు. వీరు ఏడుగురు, నియామక రాజకుమారులని (Elector Princes) వీరిని పిలిచేవారు. ఈ విధముగాచేసి ఎప్పుడును ఒకే కుటుంబమునుండి చక్రవర్తి రావీలు లేకుండ చేసిరి. క్రియకువచ్చినప్పుడు మాత్రము ఒకే కుటుంబమువారు తరుచు దీర్ఘ కాలముపాటు ఈయెన్నికలపై యధికారము చెలాయించే వారు.

12, 13 శతాబ్దములలో హోహెన్‌స్టౌఫెన్ రాజవంశము సామ్రాజ్యముపై అధికారము చెలాయించుచుండిరి. హో హెన్‌స్టౌఫెన్