పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

63

క్రైస్తవమత

యుద్ధకాలమున యూరోపు

జూన్ 20, 1932.

క్రైస్తవముకునూ, ఇస్లాముకునూ 11. 12. 13 శతాబ్దములలో
జరిగిన సంఘర్షణనుగురించి కొంత వెనుకటి జాబులో తెలిసికొంటిమి.
యూరోపులో క్రైస్తవ లోకధావన వృద్ధినందజొచ్చెను. క్రైస్తవ
మిప్పటికి యూరోపునం దంతటా వ్యాపించెను. క్రైస్తవమతములోనికి
చిట్టచివర వచ్చిచేరినవారు తూర్పుయూరోపు స్లాప్ జాతులు--రష్యను
లును, ఇతరులును. దీనిని గురించి ఒక చక్కని కథ గలదు . ఇది
ఎంతవరకు నిజమో తెలియదు. వెనుకటి రష్యనులు క్రైస్తవమును
స్వీకరించుటకు ముందు. తమకులమును మార్చుకొనుటయును క్రొత్త
మతమును స్వీకరించుటయును భావ్యమా యని తర్కించుకొనిరి. వారు
విన్న క్రొత్తమతములు రెండు---- క్రైస్తవము, ఇస్లాము. కాన నేటి
కాలములో చేయువిధముగా వారొక రాయబారమును ఆయామతములు
ఆచరణలోనున్న దేశములకు పంపిరి. ఆమతములను పరిశీలించి, పరీ
క్షించి తమనిర్ణయమును రాయబారులు రష్యనుప్రజలకు తెలుపవలెను.
ఈ రాయబారులు పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతములకు, ఇస్లాంను
పరిశీలించుటకు వెళ్ళిరి. పిమ్మట వారు కాంస్టాంటినోపులు వెళ్ళిరి.
ఆర్తోడాక్సు చర్చియొక్క పూజాపురస్కార ములు, కర్మకలాపము,
సంగీతముతో, చక్కనిపాటలతో కన్నులపండువుగ, వైభవముగ
నుండెను. పురోహితులు దివ్యమగుదుస్తులు ధరించివచ్చిరి. ధూపములు