పుట:Pranayamamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడియున్నది. ఇవి నిప్పు పొగచేకప్పివేయబడి కనిపించకుండ చేయబడినటుల చిత్తముయొక్క ప్రకృతిని తెలిసికొనుటకు వీలులేకుండ చేయుచున్నవి. వీటినుండి విముక్తినిపొందుటకు ప్రాణాయామమునకు మించినదిలేదు. ఇది పవిత్రత, జ్ఞానములను కలిగింపజేయును. జ్ఞానశక్తిని కప్పి వేసియున్న కర్మయను పొర ప్రాణాయామముచే తొలగింపబడును. పునర్జన్మలకు కారణమగు యీ కర్మను ప్రాణాయామాభ్యాసముచే లేకుండ చేసి కొనుము.

మనుమహర్షి, "నీ దోషముల నన్నిటిని ప్రాణాయామమనెడు అగ్నిచే దగ్ధము చేయుము" అని చెప్పెను. విష్ణు పురాణములో, "ప్రాణశక్తిగా చెప్పబడిన యీ వాయువును ఎల్లప్పుడు గైకొన గోరుచుండువానిచే ప్రాణాయామసిద్ధి పొందిన వానినిగా చెప్పవలెను." అని గలదు.

"ధారణానుయోగ్యతా మనన:"

మనస్సు ధారణచేయుటకు యోగ్యమైనదిగా అగును. (యోగసూత్ర 2-53)

జ్ఞానావరణ తొలగింపబడిన పిదప, గాలిలేనిచోట దీపము ఏ రీతిని నిలుకడ గలదిగా వుండునో, ఆ విధముగా మనస్సు ధారణచేయుటకు అనువైనది యగును. కొన్ని కొన్ని సమయములందు రేచక పూరక కుంభకములను మూటినీ కలిపి ప్రాణాయామమనిన్నీ, కొన్ని సమయములందు వీటిలో ప్రతి దానిని ప్రాణాయామమనిన్ని వాడబడినది. ఆకాశతత్వమున ప్రాణవాయువు సంచరించుచున్నప్పుడు శ్వాసయొక్క నిడివి చాల తక్కువగ వుండును. ఇట్టి సమయమున శ్వాసను సులభముగా ఆపివేయవచ్చును. ప్రాణాయామముచే మనశ్చాంచల్యము పోవుటయే గాక వైరాగ్యోదయము కూడ కాగలదు.