పుట:Pranayamamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగు ప్రాణ శక్తిని నీ చేతి యందుంచుకొని రోగము కుదురలేదని యేల యేడ్చెదవు? న్యాయముగ ఉపయోగించుము, నీవీ సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిదప, తాకినంత మాత్రముననే అన్ని వ్యాధులను కుదుర్చగలవు. అంతే గాదు, మనస్సులో తలచినంత మాత్రముననే నివారణ కాగలవు.

దూరము నుండి

దీనినే 'అప్రత్యక్ష నివారణ' యని కూడ అందురు. దూరమున వున్న స్నేహితునికి ప్రాణశక్తిని పంపి అతని వ్యాధిని కుదుర్చ వచ్చును. కాని దీనిని గైకొనగల శక్తి అతని కుండ వలెను. ఈ విధానము ప్రకారము చేయు నప్పుడు నీ మిత్రుడు, నీవు ఎదురుగా వున్నటుల భావించవలెను.

నీవు అతనికి వుత్తరము వ్రాసి 'యిన్ని గంటలనుండి యిన్ని గంటలవరకు ప్రాణశక్తిని, నీవద్దకు పంపుదునని తెలియజేయ వలెను. అతనికి యీ విధముగ వ్రాయుము:- "ఉదయము నాల్గు గంటలకు నేను ప్రాణ శక్తిని నీ వద్దకు పంపెదను. వాటిని గైకొనుచుంటి ననెడి మానసిక భావము, కలిగి యుండుము. ఆ సమయమున ఒక పడక కుర్చీలో పడుకొనుము. కండ్లు మూసికొని యుండుము. అప్పుడు ప్రాణశక్తిని పంపెదను."

ఇక మానసికముగ యీ విధముగ చెప్పుము:- " నేను ప్రాణశక్తిని పంపుచున్నాను" ప్రాణశక్తిని పంపునప్పుడు కుంభకము చేయుము. క్రమశ్వాసను కూడ అభ్యసించుము. నీవు రేచకము చేయునప్పుడు ప్రాణశక్తినీనుండి వారి వద్దకు పోవుచున్నదని భావించుము. ఆ ప్రాణశక్తి ఆకాశము