పుట:Pranayamamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరోగ్యవంతముగ చేసికొనుచుండవలెను. కారిజము సరిగా పనిచేయుట లేదనుకొనుము.

పద్మాసనములో కూర్చొనుము, కనులు మూయుము. ముమ్మారు ఓం ను ఉచ్చరించునంత వరకు నెమ్మదిగా గాలిని పీల్చుము. ఆరు మారులు ఓం ను జపించు నంతవరకు గాలిని లోపల ఆపు జేయుము. ఆ సమయమున ప్రాణశక్తిని కారిజము వుండు ప్రదేశమునకు పంపుము. నీ మనస్సును ఆ ప్రదేశములపై నిలుపుము. నీవు పంపుచున్న ప్రాణశక్తి కారిజమున ప్రవేశించి దానికి పుష్టినిచ్చి, దాని యందలి జీవాణువులకు బలమును కలిగించి, అవి యన్నియు తమ తమ కార్యములను చక్కగా నెరవేర్చునటుల చేయు చున్నదని భావించుము. నమ్మకము, భావన, ఏకాగ్రతలు ఈరీతిగా వ్యాధులను కుదుర్చుటలో ప్రధాన పాత్రను వహించును. ఆ పిమ్మట నెమ్మదిగా రేచకము చేయుము. రేచకము చేయునప్పుడు కారిజమునందు గల రోగ బీజాణువు లన్నియు బయటకు నెట్టివేయ బడినవని భావించుము. ఈ రీతిని ఉదయము పండ్రెండు మారులు, సాయంత్రము పండ్రెండు మారులు చేయుము. కొద్దిరోజులు యిటుల చేయుటచే ఆ బాధతగ్గి పోవును. ఇది మందులేని ప్రకృతి వైద్యము. ఈ రీతిని ప్రాణాయామ సమయములో ప్రాణవాయువును వ్యాధిగల స్థలముకు గొంపోయి దీర్ఘ వ్యాధులను గాని, తరుణ వ్యాధులనుగాని కుదుర్చుకో గలవు. ఒకటి రెండు మారులు నీ వ్యాధిని నీవు కుదుర్చుకొనుటకు ప్రయత్నము చేయుము. అప్పుడు నీకు నమ్మకము కలుగ గలదు.

చేతిలో వెన్నను పెట్టికొని, నెయ్యి లేకపోయెను గదా యని యేడ్చెడు అబలవలె డబ్బులేని మహిమ నంత