పుట:Pranayamamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుఖముగా ఆపగలిగినంతసేపు ఆపుము. ఆ పిమ్మట చాల నెమ్మదిగ దీర్ఘ రేచకమును చేయుము. ఇచ్చటికి ఒక ప్రాణాయామము అయినదని అర్ధము. ఇటుల ఒక ప్రాణాయామము కాగానే కొన్ని స్వాభావిక శ్వాసోచ్చ్వాసలు తీసికొనుట మూలమున విశ్రమించుము. ఇటుల చేయుటచే నీకు కొంత విశ్రాంతి లభించి, రెండవ ప్రాణాయామము చేయుటకు బలము చేకూరును. ఈరీతిని ప్రతిరోజు ఉదయము మూడు ప్రాణాయామములు చేయుము. సాయంత్రము మరొక మూడు ప్రాణాయామములను చేయవచ్చును. ప్రతిపూట మూడు ప్రాణాయామములు చేయుటకు కూడ తీరిక వుండని వ్యవహార వేత్తలు, పూటకు కనీసము ఒక ప్రాణాయామమునైన చేయుట లాభకరము. భస్త్రిక-కపాలభాతి, ఉజ్జయి ప్రాణాయామముల సమ్మేళనము. ప్రారంభంలో కపాలభాతి, ఉజ్జయి ప్రాణాయామములను చేసినచో, ఆ పిమ్మట భస్త్రికను సులభముగ చేయ గలుగుదువు.

కొందరు అలసిపోవునంత సేపటివరకు చేయుదురు. ఇది చేయునప్పుడు విపరీతముగ చెమటపోయును. సాధనా సమయములో మత్తుగాతోచినచో, అట్టి సమయమందు కొన్ని స్వాభావిక (Normal) శ్వాసలను తీసికొనుము. అందుచే మత్తుపోవును. అదిపోగానే మరల సాధనము మొదలిడును. దీనిని శీత కాలములో ఉదయ, సాయంత్రములందును, ఎండకాలములో ఉదయమున చల్లగానున్న సమయమందును చేయవలెను.

ఇది గొంతువాపును పోగొట్టును, జఠరాగ్నిని పెంపొందించును. శ్లేష్మమును రూపుమాపును. ముక్కు, రొమ్ముకు సంబంధించిన వ్యాధులను పెరికి వేయును. క్షయ, ఉబ్బసములను మచ్చునకైన లేకుండచేయును. ఆకలిని కలిగించును. బ్రహ్మ,