పుట:Pranayamamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రాణాయామము రక్తమును శుభ్రపరచును. ఆకలి దప్పులను చల్లార్చును. శరీరమును చల్లగా వుంచును. గుల్మము, ప్లీహ, జ్వరము, దీర్ఘవ్యాధులు, క్షయ, అజీర్తి, శ్లేష్మము, పైత్యదోషములు, పాము,తేలు మొదలగువాని విషముల వల్ల కలుగు దోషములను పోగొట్టును. నీరు దొరకుట దుర్లభముగా తోచుస్థితిలో దాహము వేసినచో ఈ ప్రాణాయామమును చేయుము. వెంటనే దప్పిక లేకుండ పోవును. ఈ ప్రాణాయామమును ప్రతినిత్యము అభ్యసించువానిని తేలు, పాము కాటుల ఏమియు చేయజాలవు. ఈ ప్రాణాయామ సాధకుడు, నీరు, ఆహారము, గాలి లేకుండా తన శరీరమును కాపాడుకొనగల శక్తి శాలి యగును. అన్ని విధములగు వేదనలు, పోటు, బాధ, మంట, జ్వరాదులనుండి విముక్తిని పొందును.

భస్త్రిక

సంస్కృతములో భస్త్రికయన కొలిమితిత్తిఅని అర్థము. ఈ ప్రాణాయామము చేయునప్పుడు కమ్మరి తన కొలిమి తిత్తులను ఎంతత్వరగా తెరచుట మూయుటలను చేయుచుండునో అంతత్వరగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేయుచుండవలెను.

పద్మాసనములో కూర్చొనుము. శరీరము, మెడ, తల లను నిలువుగా తిన్నగావుంచుము. నోటిని మూయుము. ఆ పిమ్మట గాలిని పీల్చుట, విడచుటలను త్వరత్వరగా కొలిమితిత్తివలె పదిమారులుచేయుము. ఇది చేయునప్పుడు ఒక విధమగు ధ్వనిపుట్టును. సాధకుడు ఈ సాధనను అతిత్వరత్వరగా చేయు చుండవలెను. ఇటుల పదిమారులు చేయగనే చివరిపర్యాయము దీర్ఘముగ శ్వాసించుము. ఆ తీసికొన్న శ్వాసను నీవు లోపల