పుట:Pranayamamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సగర్భ ప్రాణాయామము అనున దొకటి గలదు. ఈ ప్రాణాయామములో, ప్రాణాయామముతో పాటు మానసికముగ గాయత్రి లేక 'ఓం' మంత్రజపము చేయుదురు. ఈప్రాణాయామము అగర్భ ప్రాణాయామము(మంత్రజపము లేకుండ చేయు ప్రాణాయామము) కంటె నూరురెట్లు లాభకారి. ప్రాణాయామసిద్ధి, సాధకుని ఉత్సాహము, సాహసము, పట్టుదలపై ఆధారపడి వుండును. ఈ లక్షణములు గలవానికి 6 మాసములలో సిద్ధి ప్రాప్తి కలుగును. సోమరి పోతు, బద్ధకస్తుడుగావుండి సంశయ గ్రస్తుడగు వానికి 8, 10 సంవత్సరములకు కూడ ఏ విధమగు అభివృద్ధియు కనుపించదు. కావున, పట్టుదల, ఓర్పు, విశ్వాసము, శ్రద్ధ, ఉత్సాహములు కలవాడవై పాటుపడుము. నీకు తప్పక విజయప్రాప్తి కలుగును.

వేదాంతుల కుంభకము

ఏవిధమగు చాంచల్యము లేకుండ ప్రశాంతమగు మనస్సుతో ప్రాణాయామమును అభ్యసించవలెను. శ్వాసప్రశ్వాసలను రెంటిని నిరోధించవలెను. బ్రహ్మానుసంధానమే తన జీవిత లక్ష్యముగా ఎంచవలెను. బాహ్యవస్తు త్యాగమును రేచకమందురు. ఆధ్యాత్మికజ్ఞానము, శాస్త్రజ్ఞానము లేక అట్టి విషయములనుగురించి తెలిసికొనుటలను పూరకమందురు. చిత్తమును ఈ విధమగు సాధనలను చేయులాగున చేయువాడే ముక్తుడు. మనస్సును పరమశివునిపై నిలుపుటయే కుంభకము. ఈ కుంభకము ప్రాణాయామకుంభకమువల్ల చక్కగా సిద్ధించును. ఇందువలన మొట్టమొదట బ్రహ్మగ్రంథి వద్ద మార్గమేర్పడును. అచ్చటినుంచి విష్ణుగ్రంథి, విష్ణుగ్రంథినుండి రుద్ర