పుట:Pranayamamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందును సిద్ధి పొందుచూ రావలెను. ఇందువల్ల భిన్నభిన్న మహిమలు లభించును.

త్రివిధ ప్రాణాయామములు

అధమము, మధ్యమము, ఉత్తమము, అని ప్రాణాయామములు మూడువిధములు. అధమము 12 మాత్రలు, మధ్యమము 24 మాత్రలు, ఉత్తమము 32 మాత్రల పూరక కాల పరిమితిని కలిగి వుండును. పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1:4:2 గా వుండవలెను. పూరకము అన, గాలిని పీల్చుట, కుంభకము అన, గాలిని లోపల ఆపుజేయుట. రేచకము అన, గాలిని బయటకు విడచుట అని అర్థము. 12 మాత్రల కాలము పూరకము చేసినచో, 48 మాత్రల కాలము కుంభకమున్నూ, 24 మాత్రల కాలము రేచకమున్నూ చేయవలెనని పై దాని అర్థము. ఇది అధమ ప్రాణాయామము. తతిమ్మా రెండు ప్రాణాయామములకు కూడ ఈ నియమమే వర్తించును.

మొట్టమొదట అధమ ప్రాణాయామమును ఒక మాసము రోజులు అభ్యసించును. మధ్యమ ప్రాణాయామమును ఆతరువాత మూడు మాసముల వరకు అభ్యసించుము. అటు పిమ్మట ఉత్తమ ప్రాణాయామమును మొదలిడుము.

ఆసనములో కూర్చున్న వెంటనే, నీ గురువునకున్నూ, శ్రీ గణేశునకున్నూ నమస్కారము చేయుము. ప్రాణాయామాభ్యాసము చేయుటకు ఉదయం 4 గం; 10 గం; సాయంత్రం గం 5; రాత్రి గం 10; 12 గం ల సమయములు తగినవి. నీవు ఉచ్చస్థితికి రాగానే రోజుకు 320 ప్రాణాయామములను చేయుచుండ వలెను.